Breaking News

ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ను నియమించరా?

Published on Thu, 09/18/2025 - 05:10

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ)కి పూర్తిస్థాయి చైర్మన్‌ను నియమించకపోవడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. రాష్ట్రంలో లోకాయుక్త, మానవహక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్‌సీ) వంటి సంస్థలకు అధిపతులు లేకుండా (హెడ్‌లెస్‌) ఉన్నాయని ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ పోస్టులను భర్తీచేయడానికి వచ్చిన ఇబ్బందేమిటని నిలదీసింది. నిర్దిష్ట గడువులోపు ఈఆర్‌సీ చైర్మన్‌ నియామకాన్ని పూర్తిచేయాలని ఆదేశించింది. 

లేనిపక్షంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌)ని కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టును ఎప్పటిలోగా భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంది. తదుపరి విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. గత ఏడాది అక్టోబర్‌ నుంచి ఖాళీగా ఉన్న ఏపీఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టును భర్తీచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదంటూ డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. 

ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారించింది. పిటిషనర్‌ న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఈఆర్‌సీ చైర్మన్‌ పోస్టు ఏడాదిగా ఖాళీగా ఉందని తెలిపారు. సభ్యుల పోస్టులు కూడా ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. సభ్యుడే ఇన్‌చార్జి చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారని తెలిపారు. 

ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఓ సభ్యుడి నియామకానికి నోటిఫికేషన్‌ ఇచ్చినట్లు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జిల్లా కలెక్టర్ల సమావేశంలో బిజీగా ఉండటంతో పూర్తి వివరాలు తెప్పించుకోలేకపోయినట్లు చెప్పారు. దీంతో ధర్మాసనం గడువులోపు ఈ ఖాళీలను భర్తీచేయాల్సిందేనని తేల్చిచెప్పింది. ఎప్పటిలోపు భర్తీచేస్తారో స్పష్టంగా చెప్పాలంటూ విచారణను ఈ నెల 24కి వాయిదా వేసింది. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)