Breaking News

‘మీకు చెప్పాలా?’ అనడం అమర్యాద కాదు

Published on Sun, 07/26/2026 - 07:52

సాక్షి, అమరావతి: ‘మీకు చెప్పాలా..?’ అనే ఒక చిన్న పదబంధంతో చిన్న స్థాయి క్రమశిక్షణాపరమైన శిక్షకు (సెస్సూర్‌) గురై పదోన్నతి కోల్పోయిన ఒక మహిళా డిప్యూటీ తహసీల్దార్‌ న్యాయపోరాటంలో విజయం సాధించిన వైనమిది. ప్రభుత్వ ఉద్యోగులపై చిన్నపాటి ఆరోపణల ఆధారంగా విధించే క్రమశిక్షణా చర్యల విషయంలో స్పష్టమైన మార్గదర్శకత్వాన్ని అందించిన  ఈ కేసు వివరాల్లోకి వెళితే..

ఆర్‌టీఐ చట్టం కింద సమాచారం కోరిన 77 ఏళ్ల వృద్ధుడు డి. ప్రభాకర్‌రావుతో మాట్లాడేటప్పుడు ‘మీకు చెప్పాలా?’ అని అమర్యాదగా ప్రవర్తించారంటూ వచ్చిన ఫిర్యాదు ఆధారంగా డిప్యూటీ తహసీల్దార్‌ మాలతికి  పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్‌ సెస్సూర్‌ శిక్షను విధించారు. ఈ శిక్ష కారణంగా మాలతి తహసీల్దార్‌ పదోన్నతిని కోల్పోయారు. ఆమెకన్నా సీనియారిటీలో వెనుకబడి ఉన్న 16 మందికి మాత్రం తహసీల్దార్లుగా పదోన్నతి లభించింది. 

ఈ అంశంపై ఆమె హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై హైకోర్టు విచారణ జరిపింది. మాలతి సమాచారం ఇవ్వడానికి నిరాకరించలేదని, కేవలం సాధారణ స్థానిక భాషలో ఉపయోగించే పదబంధాన్ని అమర్యాదగా పరిగణించి శిక్షించడం సమంజసం కాదని హైకోర్టు తేల్చిచెప్పింది. సెస్సూర్‌ను రద్దు చేసి, సీనియారిటీ మేరకు సదరు ఉద్యోగిని పేరును పదోన్నతికి పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వా­న్ని ఆదేశిస్తూ న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ ఇటీవల తీర్పు వెలువరించారు.   1997లో జారీ చేసిన జీవో 53 ప్రకారం సెస్సూర్‌ శిక్ష పడిన ఉద్యోగికి ఒక సంవత్సరం పాటు పదోన్నతి పొందే అర్హత ఉండదన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)