Breaking News

‘మీకు ఏ అధికారం ఉంది’.. మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Published on Mon, 07/28/2025 - 17:32

సాక్షి,అమరావతి: పోలీసులపై ఏపీ హైకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. గుత్తికొండకు చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త పఠాన్ కరీమ్‌ గతంలో టీడీపీ నేతలపై ఓ కేసు పెట్టారు. ఆ కేసు విత్‌డ్రా చేసుకోవాలంటూ పఠాన్‌పై పోలీసులు ఒత్తిడి చేస్తున్నారు. ఈ మేరకు పఠాన్‌ను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే అంశంపై పఠాన్‌ భార్య ఏపీ హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేశారు. తన భర్తను పోలీసులు అక్రమంగా నిర్బంధించారంటూ పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ పిటిషన్‌పై ఏపీ హైకోర్టు  సోమవారం విచారణ చేపట్టింది. 

పఠాన్ కరీం మీ దగ్గరే ఉన్నారా?అని పోలీసుల్ని హైకోర్టు ప్రశ్నించింది. అందుకు తమ ఆధీనంలోనే ఉన్నారంటూ పోలీసులు తరఫున న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎందుకు అదుపులోకి తీసుకున్నారని హైకోర్టు ప్రశ్నించింది. కౌంటర్ కేసులున్నాయని.. వాటిని రాజీ చేయించేందుకే  అదుపులోకి తీసుకున్నామని పోలీసుల తరపున న్యాయవాది కోర్టుకు తెలిపారు.

దీంతో పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీరు ఏ అధికారంతో కేసును విత్‌డ్రా చేస్తారని ప్రశ్నించింది. ఈ కేసును తానే విచారిస్తానని.. మంగళవారం పఠాన్ కరీంను తమ ముందు హాజరు పరచాలని ఏపీ హైకోర్టు న్యాయమూర్తి.. పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. రేపటి వరకు పఠాన్‌ను తహసిల్దార్ వద్ద ఉంచాలని పోలీసులకు ఆదేశించారు.  

మరోసారి పోలీసులపై ఏపీ హైకోర్టు ఆగ్రహం

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)