Breaking News

మాల్స్‌లో పార్కింగ్‌ ఫీజుపై స్పందించిన హైకోర్టు

Published on Thu, 06/27/2024 - 04:26

సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై హైకోర్టు స్పందించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 7కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ నైనాల జయసూర్య ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్స్‌లో వినియోగదారుల నుంచి పార్కింగ్‌ ఫీజు వసూలు చేయడం చట్ట, రాజ్యాంగ విరుద్ధమంటూ విజయవాడకు చెందిన చందన మోహనరావు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. మల్టీప్లెక్స్‌లలో పార్కింగ్‌ చార్జీల వసూలుకు ఆస్కారం కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 35ను చట్ట విరుద్ధంగా ప్రకటించాలని కోరా­రు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధ­వారం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫున న్యాయవాది వివేకానంద విరూపాక్ష వాదనలు వినిపించారు. 

మల్టీప్లెక్స్‌లు, వాణిజ్య సముదాయాలు, షాపింగ్‌ మాల్స్‌లో వినియోగదారుల నుంచి విచక్షణారహితంగా పార్కింగ్‌ ఫీజు వసూలు చేస్తున్నారన్నారు. ఎలాంటి పార్కింగ్‌ ఫీజులు వసూలు చేయరాదని హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పుని చ్చిందని తెలిపారు. ఈ తీర్పునకు విరుద్ధంగా ప్రభుత్వం జీవో 35 జారీ చేసిందన్నారు. 

ఈ సమయంలో అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) తరఫున హాజరవుతున్న న్యాయవాది సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. జీవో 35 స్థానంలో జీవో 13 తీసుకురావడం జరిగిందన్నారు. ఆ జీవోను కోర్టు ముందుంచారు. దానిని పరిశీలించిన ధర్మాసనం.. జీవో 13 సినిమా టికెట్లకు సంబంధించిందని, అందులో పార్కింగ్‌ ఫీజుల ప్రస్తావన లేదని తెలిపింది.  

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)