Breaking News

కోర్టు పరిధిలో ఉన్న అంశంపై మీడియా ముందు ఎలా మాట్లాడతారు?

Published on Thu, 09/12/2024 - 05:11

సాక్షి, అమరావతి: సినీనటి కాదంబరి జత్వానీకి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉండగానే.. దాని గురించి మీడియా ముందు ఎలా మాట్లాడతారని ఆమె తరఫు న్యాయ­వాదులను హైకోర్టు ప్రశ్నించింది. అలా మాట్లాడటం ఎంత మాత్రం సమంజసం కాదంది. న్యాయవాదిగా అన్నీ తెలిసి కూడా కేసు పూర్వాపరాల గురించి మాట్లాడటం సహేతుకం కాదని తేల్చి చెప్పింది. ఇకపై ఈ కేసు గురించి మీడియాతో మాట్లాడవద్దంది. 

ఆ కేసు గురించి ఎవరు చర్చ మొదలు పెట్టా­రో, ఎవరు దానిని కొనసాగిస్తున్నారో తమకు తెలుసునంది. జత్వానీకి చెందిన మొబైల్‌ ఫోన్లు, ఐ పాడ్, ల్యాప్‌టాప్‌ తదితర ఉపకరణాలు ప్రస్తుతం ఎవరి వద్ద ఉన్నాయో చెప్పా­లని పోలీసులను ఆదేశించింది. అలాగే వాటిని భద్రపరిచేందుకు ఏం చర్యలు తీసుకున్నారో కూడా తెలియచేయాలంది. ఈ వివరాలను తమ ముందుంచాలంటూ విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది. 

ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా  సినీనటి కాదంబరి నరేంద్ర కుమార్‌ జత్వానీ, ఆమె తల్లి తనను బెదిరించి, బ్లాక్‌ మెయిల్‌ చేసి తన నుంచి భారీ మొత్తం వసూలు చేశారంటూ కుక్కల విద్యాసాగర్‌ ఈ ఏడాది ఫిబ్రవరిలో ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన హైకోర్టు, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్‌ ఫోన్లు, ఇతర ఉపకరణాలను భద్రపరచాలని పోలీసులను ఆదేశించిన విషయం తెలిసిందే. 

మొబైల్, ఐపాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమాచారం..  
బుధవారం ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా, విద్యాసాగర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ, జత్వానీ నుంచి జప్తు చేసిన మొబైల్‌ ఫోన్లు, ఐ పాడ్, ల్యాప్‌టాప్‌లలో కీలక సమా­చా­రం ఉందన్నారు. అందులో ఉన్న సమాచారాన్ని వెలికి తీసేందుకు అవన్నీ కూడా ఫోరెన్సిక్‌ సైన్స్‌ లే»ొరేటరి (ఎఫ్‌సీఎల్‌) వద్ద ఉన్నాయని తెలిపారు. అయితే పోలీసులు ఇప్పుడు వాటిని వెనక్కి తెప్పించి జత్వానీకి ఇచ్చేయనున్నారని తెలిపారు. కోర్టు ప్రమేయం లేకుండా ఇలా చేయడానికి వీల్లేదని తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరారు. 

అలాంటి ఆదేశాలు హైకోర్టు ఇవ్వలేదు... 
జత్వానీ తరఫు న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ, ఈ వ్యాజ్యంలో తాము ప్రతివాదిగా చేరుతామని, ఇందుకు అనుమతినివ్వాలని కోరుతూ పిటిషన్‌ దాఖలు చేశామన్నారు. జత్వానీ నుంచి జప్తు చేసిన ఫోన్లు ఇతర ఉపకరణాలను వెనక్కి ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. దీనికి న్యాయమూర్తి స్పందిస్తూ, అవన్నీ కూడా కేసుతో ముడిపడి ఉన్న ఉపకరణాలని, వాటిని వెనక్కి ఇచ్చే విషయంలో నిర్ణయం తీసుకోవాల్సింది సంబంధిత మేజిస్ట్రేట్‌ మాత్రమేనని చెప్పారు. ఇందులో హైకోర్టు ఏ రకంగానూ జోక్యం చేసుకోలేమన్నారు.

‘బిగ్‌బాస్‌ షో’పై తీర్పు వాయిదా 
సాక్షి, అమరావతి: అశ్లీలత, అసభ్యత, అనైతిక, హింసాత్మక చర్యలను ప్రోత్సహించడంతో పాటు యువతను పెడదోవ పట్టిస్తున్న బిగ్‌బాస్‌ షో ప్రసారాన్ని నిలుపుదల చేసేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)­­లో వాదనలు ముగిశాయి. వాదనలు విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధ­వారం ఉత్తర్వులు జారీ చేసింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)