పీజీ వైద్య విద్య నిబంధనల సవరణ సబబే

Published on Fri, 01/17/2025 - 05:44

సాక్షి, అమరావతి: రాష్ట్ర వైద్యశాఖలో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లుగా చేరిన వారికి పీజీ వైద్య విద్యను అభ్యసించే నిమిత్తం కేటాయించే ఇన్‌సర్వీస్‌ కోటా నిబంధనలను మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది జూలై 20న జారీ చేసిన జీవో–85లోని పలు నిబంధనలను హైకోర్టు సమర్థించింది. ఇన్‌సర్వీస్‌ కోటా కింద రిజర్వేషన్‌ సీటు పొందాలంటే నీట్‌ పీజీ, సూపర్‌ స్పెషాలిటీ పరీక్ష నోటిఫికేషన్‌ జారీ అయ్యే నాటికి 50 ఏళ్లు దాటి ఉండకూడదన్న నిబంధన విషయంలో జోక్యానికి హైకోర్టు నిరాకరించింది. 

అలాగే పీజీ కోర్సు పూర్తి చేసిన తరువాత రాష్ట్రంలో పదేళ్ల పాటు సేవలు అందించాలన్న నిబంధనను కూడా సమర్థించింది. అంతేకాక ఇన్‌సర్వీస్‌ కోటా ఒప్పందాన్ని ఉల్లంఘించిన వారికి విధించే జరిమానాను రూ.25 లక్షల నుంచి రూ.50 లక్షలకు పెంచడాన్ని కూడా హైకోర్టు సమర్థించింది. జీవో–85లోని ఈ నిబంధనలను ఎంతమాత్రం ఏకపక్షంగా ప్రకటించలేమని తేల్చి చెప్పింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం ఇటీవల తీర్పు వెలు వరించింది. కాల వ్యవధి, జరిమానా పెంపు వంటి సవరణలను సవాల్‌ చేస్తూ మేదరమెట్ల ప్రైమరీ హెల్త్‌ సెంటర్‌లో సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌గా పనిచేస్తున్న డాక్టర్‌ జి.చిట్టిబాబు పిటిషన్‌ దాఖలు చేశారు.

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)