Breaking News

నిందితులను రోడ్లపై ఎలా పెరేడ్‌ చేయిస్తారు?

Published on Thu, 02/05/2026 - 06:00

సాక్షి, అమరావతి: పోలీసులు సామాన్య ప్రజలతో అమానవీయంగా వ్యవహరిస్తున్నారని హైకోర్టు ఘాటుగా వ్యాఖ్యానించింది. చట్ట నిబంధనలను పాటించాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని తేల్చి చెప్పింది. చట్టానికి లోబడే పోలీసులు శాంతి భద్రతలను కాపాడాల్సి ఉంటుందని చెప్పింది. వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్‌ చేయిస్తూ.. ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియా ముందు ఎందుకు ప్రవేశపెడుతున్నారని పోలీసులను నిలదీసింది. నేరం నిరూపణ అయ్యేంత వరకు నిందితులు నిరపరాధులేనని స్పష్టం చేసింది. 

నిందితులను పెరేడ్‌ చేయిస్తున్న వ్యవహారంలో రాష్ట్ర‡ ప్రభుత్వానికి, డీజీపీ, గుంటూరు, కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల ఎస్‌పీలకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్‌లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను నాలుగు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

వివిధ కేసుల్లో అరెస్టు చేసిన నిందితులను రోడ్లపై పెరేడ్‌ చేయిస్తూ, ప్రింట్, ఎల్రక్టానిక్‌ మీడియా ముందు ప్రవేశపెట్టడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించాలని కోరుతూ సొసైటీ ఫర్‌ ప్రొటెక్షన్‌ ఆఫ్‌ సివిల్‌ ప్రాపర్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ రైట్స్‌ కృష్ణా జిల్లా అధ్యక్షుడు పరసా సురేష్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది.

పోలీసులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు 
పిటిషనర్‌ తరఫు న్యాయవాది జడా శ్రవణ్‌ కుమార్‌ వాదనలు వినిపిస్తూ, నిందితులను రోడ్లపై పెరేడ్‌ చేయించడం ఇటీవలి కాలంలో పెరిగిపోయిందని, ఇలా పెరేడ్‌ చేయించి మీడియా ముందు ప్రవేశపెట్టడం సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులకు విరుద్దమని తెలిపారు. ఇలా చేయడం ఓ రకంగా నేరం చేశారని తీర్పునిచ్చేయడమేనన్నారు. వాస్తవానికి నేరం చేశారా లేదా అన్నది తేల్చాల్సింది న్యాయవ్యవస్థ మాత్రమేనని, అయితే రాష్ట్రంలో పోలీసులే న్యాయ నిర్ణేతల్లా వ్యవహరిస్తున్నారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

నేరారోపణ ఉన్న ప్రతి వ్యక్తీ దోషి కాదని, అలాంటప్పుడు వారిని రోడ్లపై పెరేడ్‌ చేయించడం వారి హక్కులను హరించడమే అవుతుందని ఆయన పేర్కొన్నారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఉత్తర భారతదేశంలో ఓ ద్విచక్ర వాహనదారుడిని పోలీసులు దూషిస్తూ కొడుతున్నారని, ఇందుకు సంబంధించిన ఓ వీడియో క్లిప్పింగ్‌ తమకు వచి్చందని తెలిపింది. సామాన్య ప్రజల పట్ల పోలీసులు అమానవీయంగా వ్యవహరిస్తున్నారంది. పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) సింగమనేని ప్రణతి వాదనలు వినిపిస్తూ.. ఓ కేసులో నిందితుడిని తీసుకెళ్లే వాహనం మరమ్మతులకు గురి కావడంతో పోలీసులు అతన్ని నడిపించుకు తీసుకెళ్లారని, దీన్ని ఫోటోలు తీసి ప్రచారం చేశారని వివరించారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వానికి నోటీసులు జారీ చేస్తూ కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)