Breaking News

జగన్‌కు ప్రతిపక్ష నేత హోదాపై కౌంటర్లు వేయండి

Published on Tue, 11/12/2024 - 06:06

సాక్షి, అమరావతి : శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్‌సీపీ శాసన సభాపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దాఖలు చేసిన వ్యాజ్యంపై కౌంటర్లు దాఖలు చేసేందుకు శాసన సభ కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శికి హైకోర్టు మరింత గడువునిచ్చింది. గతంలో కౌంటర్ల దాఖలుకు మూడు వారాల గడువునిచ్చిన హైకోర్టు, ఇప్పుడు మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. చట్ట ప్రకారం శాసన సభలో తనకు ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేలా శాసన సభ కార్యదర్శి, స్పీకర్‌ కార్యదర్శిని ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ శానస సభాపక్ష నేత జగన్‌మోహన్‌రెడ్డి ఇటీవల హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన హైకోర్టు.. శాసన సభ, స్పీకర్‌ కార్యదర్శులకు నోటీసులు జారీ చేసి, కౌంటర్ల దాఖలుకు ఆదేశాలిచ్చింది. తాజాగా ఈ వ్యాజ్యం సోమవారం మరోసారి విచారణకు వచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలుకు మరింత సమయం ఇవ్వాలని శాసన సభ కార్యదర్శి తరఫు న్యాయవాది గింజుపల్లి సుబ్బారావు కోరారు. స్పీకర్‌కు రాజ్యాంగపరమైన రక్షణ ఉందని, ఆ వివరాలను కూడా కౌంటర్‌లో పొందుపరుస్తామని చెప్పారు. దీనికి జగన్‌ తరపు న్యాయవాది చింతల సుమన్‌ స్పందిస్తూ.. హైకోర్టు గతంలోనే నోటీసులు జారీ చేసిందని చెప్పారు.

చిరునామా సరిగా లేదంటూ స్పీకర్‌ కార్యదర్శి నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారని తెలిపారు. పోస్టుమేన్‌ స్పీకర్‌ కార్యదర్శి కార్యాలయానికి వెళ్లగలిగినప్పుడు చిరునామా సరిగా లేదన్న ప్రశ్నే ఉత్పన్నం కాదని అన్నారు. న్యాయ శాఖ కార్యదర్శి తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్‌ జోక్యం చేసుకుంటూ.. ఈ వ్యాజ్యంలో స్పీకర్‌ చింతకాయల అయ్యన్నపాత్రుడు, శాసన వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్‌ను వ్యక్తిగత హోదాలో ప్రతివాదులుగా చేర్చారని, అది అనవసరమని చెప్పారు. వాదనలు విన్న న్యాయమూర్తి, కౌంటర్ల దాఖలుకు అసెంబ్లీ, స్పీకర్‌ కార్యదర్శులకు మరో నాలుగు వారాల గడువునిస్తూ విచారణను ఆ మేరకు వాయిదా వేశారు.

Videos

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)