Breaking News

చిన్న శిక్షతో సరిపెడతారా?

Published on Thu, 06/15/2023 - 03:45

సాక్షి, అమరావతి : ఓ వ్యక్తి నిర్భంధం విషయంలో వాస్తవాలను తేల్చేందుకు నియమితులైన అడ్వొకేట్‌ కమిషనర్‌ను, అతనికి సాయంగా వెళ్లిన కోర్టు సిబ్బంది, ఇతరులపై చేయి చేసుకున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న అనంతపురం జిల్లా, హిందూపురం వన్‌ టౌన్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇస్మాయిల్‌పై నామమాత్రపు చర్యలు తీసుకున్నారంటూ హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. పోలీసులు సమాజానికి సంరక్షకులని, అలాంటి పోలీసు తప్పు చేసినప్పుడు చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉన్నతాధికారులపై ఉందని స్పష్టం చేసింది.

రెండు ఇంక్రిమెంట్లలో కోత విధించడం చాలా చిన్న శిక్ష అని, ఇలాంటి శిక్ష విధించడం ద్వారా సమాజానికి ఏం సందేశం పంపిస్తున్నారని ప్రశ్నించింది. కింది కోర్టు ఉత్తర్వులను అపహాస్యం చేసిన పోలీసు అధికారికి చిన్న శిక్ష విధించడాన్ని ఎలా సమర్థించుకుంటారో తెలియచేయాలని ఉన్నతాధికారులను ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలంటూ తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే ఇదే వ్యవహారంలో హైకోర్టు సుమోటోగా నమోదు చేసిన కోర్టు ధిక్కార కేసులో కౌంటర్‌ దాఖలు చేయాలని సీఐని హైకోర్టు ఆదేశించింది.

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి(ఏసీజే) జస్టిస్‌ ఆకుల వెంకటశేషసాయి, న్యాయమూర్తి జస్టిస్‌ రావు రఘునందన్‌రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వొకేట్‌ కమిషనర్, కోర్టు సిబ్బందిని ఇస్మాయిల్‌ కొట్టారంటూ అనంతపురం జిల్లా జడ్జి ఇచ్చిన నివేదికను హైకోర్టు సుమోటో ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌)గా మలిచిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై ఏసీజే నేతృత్వంలోని ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. గత విచారణ సమయంలో ధర్మాసనం ఇచ్చిన ఆదేశాల మేరకు సీఐ ఇస్మాయిల్‌ స్వయంగా కోర్టు ముందు హాజరయ్యారు. తదుపరి విచారణకు సైతం హాజరు కావాలని ఇస్మాయిల్‌ను ధర్మాసనం ఆదేశించింది.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)