Breaking News

పిన్నెల్లికి ముందస్తు బెయిల్‌ 20 వరకు పొడిగింపు..

Published on Fri, 06/14/2024 - 08:43

సాక్షి, అమరావతి: పోలీసులు నమోదు చేసిన మూడు వేర్వేరు కేసుల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేస్తూ ఇచ్చిన ఉత్తర్వులను హైకోర్టు మరోసారి పొడిగించింది. ఆ మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 20 తేదీ వరకు పొడిగిస్తూ.. తదుపరి విచారణను అదే రోజుకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ న్యాపతి విజయ్‌ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈవీఎం కేసులో హైకోర్టు ఈ నెల 23న పిన్నెల్లికి మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే పోలీసులు ఆయనపై రెండు హత్యాయత్నం కేసులు సహా మొత్తం మూడు కేసులు నమోదు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనకుండా చేసేందుకు పోలీసులు నమోదు చేసిన ఈ తప్పుడు కేసులపై పిన్నెల్లి మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు, కౌంటింగ్‌ ప్రక్రియలో పాల్గొనేందుకు వీలుగా పిన్నెల్లికి ఈ నెల 6వ తేదీ వరకు మధ్యంతర ముందస్తు బెయిల్‌ మంజూరు చేసింది.

తరువాత ఈ వ్యాజ్యాలు గత వారం మరోసారి విచారణకు వచ్చాయి. ఈ వ్యాజ్యాల్లో వాదనలు రాత్రి 10.30 గంటల వరకు సాగడంతో అదే రోజు ఉత్తర్వులు జారీ చేసేందుకు న్యాయస్థానానికి సమయం దొరకలేదు. దీంతో న్యాయస్థానం గతంలో ఇచ్చిన మధ్యంతర ముందస్తు బెయిల్‌ను ఈ నెల 13వ తేదీ వరకు పొడిగించిన విషయం తెలిసిందే. తాజాగా గురువారం పిన్నెల్లి వ్యాజ్యాలు విచారణకు రాగా న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌ స్పందిస్తూ.. పూర్తిస్థాయిలో వాదనలు విన్నప్పటికీ, నిర్ణయం వెలువరించేందుకు కొంత సమయం పడుతుందన్నారు.

ఈలోగా కోర్టుకు వేసవి సెలవులు ముగుస్తాయని, అందువల్ల ఈ వ్యాజ్యాలను రెగ్యులర్‌ బెంచ్‌ ముందు వచ్చేలా విచారణను వాయిదా వేస్తానని ప్రతిపాదించారు. ఈ విషయంపై ఇరుపక్షాల తరఫు న్యాయవాదుల అభిప్రాయాన్ని కోరారు. ఇందుకు ఇరుపక్షాల న్యాయవాదులు అంగీకరించడంతో న్యాయమూర్తి విచారణను ఈ నెల 20కి వాయిదా వేశారు.  

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)