Breaking News

విలువైన కోర్టు సమయాన్ని వృథా చేస్తారా? 

Published on Fri, 01/05/2024 - 04:14

సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వంలో పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టి, తిరిగి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిల కోసం పిటిషన్‌ దాఖలు చేసిన కక్షిదారుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అత్య­ం­త విలువైన కోర్టు సమయాన్ని వృథా చేయడమే కాక, కోర్టు ప్రక్రియను దుర్వినియోగం చేసినందుకు ఖర్చుల కింద రూ.లక్ష జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని ఆరు వారాల్లో న్యాయ సేవాధికార సంస్థకు చెల్లించాలని ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ గుహనాథన్‌ నరేందర్, జస్టిస్‌ న్యాపతి విజయ్‌ల ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. సాంఘిక సంక్షేమ శాఖలో పనిచేస్తున్న పశ్చిమ గోదావరి జిల్లా దారవరం గ్రామానికి చెందిన ఎం.అబ్రహంను ఉద్యోగం నుంచి తొలగించడంతో ఆయన 1991లో లేబర్‌ కోర్టును ఆశ్రయించారు.

లేబర్‌ కోర్టు అబ్రహం తొలగింపు ఉత్తర్వులను రద్దు చేస్తూ 1996లో తీర్పునిచ్చింది. ఇదిలా ఉండగానే తనకు 1997 నుంచి 2002 వరకు వేతన బకాయిలు చెల్లించేలా ఆదేశించాలంటూ అబ్రహం లేబర్‌ కోర్టులో ఎగ్జిక్యూషన్‌ పిటిషన్‌ (ఈపీ) దాఖలు చేశారు. ఆ వేతన బకాయిలు చెల్లించాలని లేబర్‌ కోర్టు అధికారులను ఆదేశించింది. ఈ ఉత్తర్వులపై సాంఘిక సంక్షేమ శాఖ అధికారులు 2016లో హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. అబ్రహంను ఉద్యోగంలోకి తీసుకోవాలని లేబర్‌ కోర్టు ఆదేశాలు ఇచ్చి­న తరువాత అతనికి కాల్‌ లెటర్‌ పంపామని, ఆయ­న స్పందించలేదని కోర్టుకు నివేదించారు.

పైపెచ్చు 1992లోనే అతను తపాలా శాఖలో ఉద్యోగిగా పని చేస్తున్న విషయాన్ని దాచిపెట్టారని వివరించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తూనే, మరో వైపు సాంఘిక సంక్షేమ శాఖ నుంచి వేతన బకాయిలు కోరుతున్నారని, దీని వెనుక అబ్రహంకు దురుద్దేశాలున్నాయని వివరించారు. దీంతో వేతన బకాయిలు చెల్లించాలన్న లేబర్‌ కోర్టు ఉత్తర్వులను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి 2017లో తీర్పునిచ్చారు.  ఈ తీర్పును సవాలు చేస్తూ అబ్రహం అదే ఏడాది హైకోర్టు ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. ఈ అప్పీల్‌పై ఇటీవల జస్టిస్‌ నరేందర్‌ ధర్మాసనం తుది విచారణ జరిపింది. సాంఘిక సంక్షేమ అధికారుల తరఫున ప్రభుత్వ న్యాయవాది అప్పాధరరెడ్డి వాదనలు వినిపిస్తూ.. అబ్రహం తపాలా శాఖలో పనిచేస్తున్న విషయాన్ని ఆ శాఖ అధికారులు ధ్రువీకరించారన్నారు.

కేంద్ర ప్రభుత్వ శాఖలో పని చేస్తున్న వ్యక్తి రాష్ట్ర ప్రభుత్వం నుంచి వేతన బకాయిలు ఎలా కోరతారన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాది వాదనలతో ఏకీభవించింది. స్వీయ లాభం పొందే ఉద్దేశంతోనే అబ్రహం ఈ అప్పీల్‌ దాఖలు చేశారని ధర్మాసనం అభిప్రాయపడింది. ఉద్యోగంలో చేరకుండా వేతన బకాయిలు ఎలా కోరతారని ప్రశ్నించింది. కోర్టు ప్రక్రియ దుర్వినియోగానికి ఇది మచ్చుతునక అని తెలిపింది. న్యాయ ప్రక్రియ ఉన్నది న్యాయం చేయడానికి, కక్షిదారుల హక్కుల పరిరక్షించడానికి మాత్రమేనంది. కోర్టు అత్యంత విలువైన సమయాన్ని అబ్రహం వృథా చేశారని, ఆయన తీరును మన్నించలేమని స్ప­ష్టం చేసింది. అందువల్ల ఈ అప్పీల్‌ను భారీ ఖర్చు­లు విధించి మరీ కొట్టేయాలని నిర్ణయించామంది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)