Breaking News

14 నెలల కిందటి ఘటనలో..నిన్న ఫిర్యాదు... కేసు... ఆ వెంటనే అరెస్టా..?

Published on Thu, 07/31/2025 - 05:22

సాక్షి, అమరావతి: వైఎస్సార్‌సీపీ నేత తురకా కిషోర్‌పై కేసుల మీద కేసులు పెడుతూ, ఒక కేసులో బెయిల్‌పై బయటకు రాగానే మరో కేసులో అరెస్ట్‌ చేస్తున్న పోలీసుల తీరును హైకోర్టు ప్రశ్నించింది. 2024లో ఘటన జరిగితే.. సంవత్సరం రెండునెలల తరువాత కేసు నమోదు చేయడంపై విస్మయం వ్యక్తం చేసింది. అప్పటికప్పుడు కేసు నమోదు చేసి ఆ వెంటనే అరెస్ట్‌ చేయడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. 

తురకా కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఘటనలు ఎప్పుడు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్‌ చేశారు.. తదితర వివరాలను ఓ టేబుల్‌ రూపంలో తమ ముందుంచాలని పల్నాడు జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 4కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, జస్టిస్‌ జగడం సుమతి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది.

పోలీసుల తీరుపై హైకోర్టును ఆశ్రయించిన తురకా సురేఖ  
గుంటూరు జిల్లా జైలు నుంచి విడుదలైన తన భర్త తురకా కిషోర్‌ను పల్నాడు జిల్లా రెంటచింతల పోలీసులు అక్రమంగా నిర్బంధించారని, తన భర్తను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ తురకా సురేఖ బుధవారం హైకోర్టులో అత్యవసరంగా లంచ్‌మోషన్‌ రూపంలో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం విచారణ జరిపింది. 

పిటిషనర్‌ న్యాయవాది సానేపల్లి రామలక్ష్మణరెడ్డి వాదనలు వినిపిస్తూ.. తురకా కిషోర్‌పై ఒకదాని వెంట మరొకటి కేసులు పెడుతూనే ఉన్నారని చెప్పారు. ఒక కేసులో బెయిల్‌ వస్తే మరో కేసులో అరెస్ట్‌ చేస్తున్నారని తెలిపారు. ఇప్పటివరకు దాదాపు 12 కేసులు నమోదు చేశారన్నారు. బుధవారం ఉదయం కిషోర్‌ గుంటూరు జిల్లా జైలు నుంచి బయటకు రాగానే రెంటచింతల పోలీసులు తీసుకెళ్లారని చెప్పారు. 

గత ఏడాది ఏప్రిల్‌లో ఘటన జరిగింది  
పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపిస్తూ.. కిషోర్‌పై హత్యాయత్నం కింద మంగళవారం ఫిర్యాదు అందిందని, దాని ఆధారంగా కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్‌ చేశామని చెప్పారు. అతడిని అదనపు జూనియర్‌ సివిల్‌ జడ్జి కోర్టు ముందు ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ సమయంలో ధర్మాసనం స్పందిస్తూ.. ఘటన ఎప్పుడు జరిగిందని ప్రశ్నించింది. గత ఏడాది ఏప్రిల్‌ 8న ఘటన జరిగిందని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది తెలిపారు. 

సంవత్సరం రెండునెలల తరవాత కేసు నమోదు చేసి, వెంటనే అరెస్ట్‌ చేశారా.. అంటూ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. కిషోర్‌పై ఎన్ని కేసులు నమోదు చేశారు.. ఎప్పుడు ఘటనలు జరిగాయి.. ఎప్పుడు ఫిర్యాదు చేశారు.. ఎప్పుడు అరెస్ట్‌ చేశారు.. తదితర వివరాలను టేబుల్‌ రూపంలో అఫిడవిట్‌ దాఖలు చేయాలని పల్నాడు జిల్లా ఎస్పీని ఆదేశిస్తూ, విచారణను ధర్మాసనం వాయిదా వేసింది.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)