Breaking News

రోడ్డుపైనే అంతిమ సంస్కారమా!

Published on Thu, 12/04/2025 - 05:09

సాక్షి, అమరావతి: ఓ వ్యక్తి అంతిమ సంస్కారాలను రోడ్డుపైనే నిర్వహించడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. శ్మశాన వాటికల్లో అంతిమ సంస్కారాలు నిర్వ­హించలేని దుస్థితిలో ఉన్నామా? అని ఆవేదన వ్యక్తం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న శ్మశాన వాటికల్లో కనీస సదు­పాయాలను కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వా­నిదేనని స్పష్టం చేసింది. శ్మశానాల నిర్వహణకు నిధులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అసక్తి చూపడం లేదని ప్రశ్నించింది. శ్మశానాల ఏర్పాటు, నిర్వహణ కోసం జీవోలు ఇచ్చినప్పటికీ అవేవీ అమలు కావడం లేదంది. 

ఆ జీవోలు కేవలం కాగితాలకే పరిమిత మయ్యాయని తెలిపింది. రాష్ట్రంలో రాబోయే రెండు దశాబ్దాలకు అనుగుణంగా శ్మశాన వాటికల ఏర్పాటుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ప్రస్తుతం ఉన్న శ్మశానాల నిర్వహణకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించింది. శ్మశాన వాటికల్లో కనీస మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులను సైతం విడుదల చేయాలని స్పష్టం చేసింది. 

ఈ ఆదేశాలను అమలు చేసి దానిపై రెండు నెలల్లో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్‌ ధీరజ్‌సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చల్లా గుణరంజన్‌ ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

రాష్ట్రంలోని అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, పంచాయతీ­ల్లోని శ్మశాన వాటికల్లో కనీస సదుపాయాలు లేకపో­యినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ విజయ­వాడకు చెందిన పి.ప్రమోద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన సీజే ధర్మాసనం రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది గడిపూడి వెంకటేశ్వర్లు, పురపాలక శాఖ తరఫున ప్రభుత్వ న్యాయ­వాది అంబటి శ్రీకాంత్‌రెడ్డి వాదనలు వినిపించారు.

Videos

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

బాబుకు హైకోర్టు షాక్.. బండి దీప్తి సంచలన కామెంట్స్

ఎమ్మెల్యే మాధవిరెడ్డి భర్త ఛాలెంజ్.. ఇచ్చిపడేసిన కడప YSRCP నేతలు

Photos

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)