Breaking News

‘కారుణ్య’ అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించరాదు

Published on Wed, 01/28/2026 - 06:03

సాక్షి, అమరావతి: కారుణ్య నియామకం అనేది హక్కు కానప్పటికీ, దరఖాస్తుదారుడి అభ్యర్థనను ఏకపక్షంగా తిరస్కరించడానికి వీల్లేదని, న్యాయబద్ధంగా పరిశీలించాల్సిన బా­ధ్యత అధికారులపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది. కారుణ్య నియామకంపై అధికారులు నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు యాంత్రికంగా కాకుండా, ఆ కుటుంబం ఎదుర్కొంటున్న వాస్తవ ఆర్థిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకోవాలని తేల్చి చెప్పింది. 

దరఖాస్తు చేయడంలో జాప్యం ఉందన్న కారణంతో కారుణ్య నియామకాన్ని తిరస్కరించడానికి వీల్లేదంది. ఐదేళ్ల జాప్యం అన్నది అసాధారణ జాప్యం కానే కాదంది. తనకు, తన తండ్రికి రైల్వే శాఖలో కారుణ్య నియామకానికి సంబంధించిన నిబంధనల గురించి తెలియదని పిటిషనర్‌ చెప్పిన దాంతో హైకోర్టు ఏకీభవించింది. 

కారుణ్య నియామకం కోసం పిటిషనర్‌ నారాయణమ్మ పెట్టుకున్న దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ఆదేశించింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్‌ చీకటి మానవేంద్రనాథ్‌ రాయ్, జస్టిస్‌ గేదెల తుహిన్‌ కుమార్‌ ధర్మాసనం ఇటీవల తీర్పు వెలువరించింది. 

అసలు కేసు ఏంటంటే..! 
విజయనగరం జిల్లా, కొత్తవలస గ్రామానికి చెందిన బి.రాములు రైల్వేశాఖలో గ్యాంగ్‌మెన్‌గా పనిచేసేవారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. అనారోగ్యంతో గ్యాంగ్‌మెన్‌గా ఉద్యోగం చేసే పరిస్థితిలో లేకపోవడంతో 1999లో రాములుకు రైల్వే అధికారులు ప్రత్యామ్నాయ ఉద్యోగాన్ని (డీ కేటగిరైజేషన్‌) ఇవ్వదలిచారు. అయితే రాములు 2000లో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. రూ.1895లను పెన్షన్‌గా, రూ.1.50 లక్షలను పీఎఫ్, గ్రాట్యుటీ కింద రైల్వే అధికారులు చెల్లించారు. 

ఇదిలా ఉండగా 2006లో రాములు కుమార్తె నారాయణమ్మ కారుణ్య నియామకానికి దరఖాస్తు చేసుకున్నారు. రాములు కుటుంబ ఆరి్థక ఇబ్బందులను గుర్తించిన డివిజినల్‌ రైల్వే అధికారులు కారుణ్య నియామకం కోసం నారాయణమ్మ దరఖాస్తును ఉన్నతాధికారులకు సిఫారసు చేయగా, వారు దానిని తిరస్కరించారు. నిబంధనల ప్రకారం ఐదేళ్ల లోపు దరఖాస్తు చేయలేదంటూ నారాయణమ్మ దరఖాస్తును వారు తోసిపుచ్చారు. దీనిపై ఆమె కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్‌ (క్యాట్‌)ను ఆశ్రయించారు. 

క్యాట్‌ ఆమె పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో హైకోర్టులో ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై ఇటీవల విచారణ జరిపిన జస్టిస్‌ మానవేంద్రనాథ్‌ రాయ్‌ ధర్మాసనం అధికారులు నారాయణమ్మ దరఖాస్తును ఏకపక్షంగా తిరస్కరించడాన్ని తప్పుబట్టింది. ఉద్యోగి మరణం.. ఆ కుటుంబానికి ఆర్థిక మరణం కాకూడదని వ్యాఖ్యానించింది. క్యాట్‌ తీర్పును రద్దు చేసింది. నారాయణమ్మ దరఖాస్తును మూడు నెలల్లో పరిగణనలోకి తీసుకోవాలని రైల్వే అధికారులను ధర్మాసనం ఆదేశించింది. 

Videos

రెండు కాళ్లు లేని దివ్యాంగుడిపై దాడి.. టీడీపీ నేతల దాష్టీకం

కివీస్ తో పోరుకు బుల్డోడు అసలు కారణం ఇదే

నీ బెదిరింపులకు ఎవరూ భయపడరు దీప్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు

ఐదు రౌండ్ల కాల్పులు.. టైగర్ ష్రాఫ్ కేసులో కీలక మలుపు..!

నాకు అంత కోపం రావడానికి కారణం.. నామినేషన్ వేసేటప్పుడు అసలు ఏం జరిగిందంటే

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)