Breaking News

సబ్‌ రిజిస్ట్రార్లు సకాలంలో నిర్ణయం తీసుకోవాలి

Published on Thu, 02/20/2025 - 05:28

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా స్థిరాస్తులను రిజి్రస్టేషన్‌ చేసుకునే విధానం (ఎనీవేర్‌ రిజి్రస్టేషన్‌) కింద ప్రజలు సమరి్పంచిన డాక్యుమెంట్ల విషయంలో సబ్‌ రిజిస్ట్రార్లు్ల సకాలంలో నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు తెలిపింది. లేని పక్షంలో అవినీతికి ఆస్కారం ఇచ్చినట్లవుతుందని పేర్కొంది. రిజి్రస్టేషన్‌ కోసం ప్రజలు సమర్పించే డాక్యుమెంట్లను సకాలంలో పరిష్కరించేందుకు సబ్‌ రిజిస్ట్రార్లకు ఏవైనా మార్గదర్శకాలు జారీ చేశారా? లేదా? చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తదుపరి విచారణ ఏప్రిల్‌ 16కి వాయిదా వేసింది. 

ఈ మేరకు ప్రధాన న్యాయ­మూర్తి జస్టిస్‌ ధీరజ్‌ సింగ్‌ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్‌ చీమలపాటి రవి ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎనీవేర్‌ రిజి్రస్టేషన్‌ విధానం కింద ఆస్తుల రిజి్రస్టేషన్‌లో రిజిస్ట్రా్టర్లు జాప్యం చేస్తున్నారంటూ నెల్లూరుకి చెందిన పి.దుర్గేష్ బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం విచారణ జరిపింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది నిమ్మగడ్డ రేవతి వాదనలు వినిపిస్తూ, ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌ కింద డాక్యుమెంట్లు సమర్పించిన తరువాత, ఆ ఆస్తులు ఎక్కడున్నాయో ఆ ప్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌కు డాక్యుమెంట్లపై ఆమోదం కోరడం జరుగుతుందన్నారు. 

ఆస్తులున్న ప్రాంత సబ్‌ రిజిస్ట్రార్‌ ఆమోదం తెలిపితేనే డాక్యుమెంట్లు సమర్పించిన చోట ఉన్న సబ్‌ రిజిష్ట్రార్‌ ఆస్తులను రిజిష్టర్‌ చేస్తున్నారని వివరించారు. అంతేకాక జాయింట్‌ రిజిష్ట్రార్, సబ్‌ రిజిష్ట్రార్లను వ్యక్తిగతంగా కలిసిన తరువాతే రిజి్రస్టేషన్లు అవుతున్నాయని ఆమె ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. వారిని కలవకుంటే పని కావడం లేదన్నారు. 

ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లపై నిర్ణయం తీసుకునేందుకు నిర్థిష్ట కాల వ్యవధిని ఖరారు చేస్తూ మార్గదర్శకాలు జారీ చేశారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ వ్యవహారంలో పూర్తి వివరాలను తమ ముందుంచాలని ఆదేశించింది.  

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)