Breaking News

చంద్రబాబు కుంభకోణాన్ని హైకోర్టు నమ్మింది

Published on Wed, 09/27/2023 - 04:26

సాక్షి, అమరావతి: గత ప్రభుత్వం నైపుణ్య కేంద్రాల పేరుతో కుంభకోణం చేసిందన్న విషయాన్ని హైకోర్టు కూడా నమ్మిందని.. అందుకే చంద్రబాబు వేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేసిందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. శాసన మండలిలో మంగళవారం స్కిల్ కుంభకోణంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మాధవరావు మాట్లాడారు. రెండున్నరేళ్లు దర్యాప్తు చేసి.. 140 మందిని విచారించి.. పక్కా సాక్ష్యాధారాలు సేకరించిన తర్వాతే సీఐడీ చంద్రబాబును అరెస్ట్‌ చేసిందన్నారు.

చంద్రబాబు నిజాయితీపరుడని, రాజకీయ కక్షతోనే ఆయనను అరెస్ట్‌ చేశారంటూ టీడీపీ నాయకులు చేస్తున్న వాదనను ఆయన కొట్టిపారేశారు. సీఐడీ విచారణలో సూత్రధారి, పాత్రధారి చంద్రబాబే అని నిర్థారించుకున్న తర్వాతే ఆయనను అరెస్ట్‌ చేశారని పేర్కొన్నారు. ఈ కుంభకోణం వాస్తవంగా 2018లో టీడీపీ ప్రభుత్వ హయాంలోనే వెలుగులోకి వచ్చిందన్నారు. జీఎస్టీ ఎగ్గొట్టారంటూ నోటీసులు వస్తే.. దానిపై దర్యాప్తు చేయకుండా ఈ కుంభకోణాన్ని కప్పిపుచ్చుకోవడానికి నోట్‌ ఫైల్స్‌ను మాయం చేసిన ఘనులు వీరంటూ విమర్శించారు. 

ముసలోడు నేరం చేస్తే ఒప్పా? 
73 ఏళ్ల వ్యక్తిని అవినీతి కేసులో అరెస్ట్‌ చేశారని టీడీపీ నాయకులు గగ్గోలు పెడుతున్నారని, 60 ఏళ్లు దాటిన వ్యక్తులు తప్పు చేసినా వదిలేయాలని చట్టంలో ఎక్కడైనా ఉందా అని మాధవరావు ప్రశ్నించారు.  చంద్రబాబు తరఫు న్యాయవాదులు కూడా చంద్రబాబు అవినీతి చేయలేదని ఎక్కడా వాదించడం లేదని, సెక్షన్‌ 17ఏ ఆయనకు వర్తించదంటున్నారని చెప్పారు. ఐటీ అధికారులు నోటీసులు ఇస్తే వాళ్లకు నోటీసులు ఇచ్చే అధికారం లేదంటూ సాం­కేతిక సమస్యలు చూపించి తప్పించుకుంటున్నారని, అరెస్ట్‌ చేస్తానంటే జైల్‌లో కాదు హౌస్‌ అరెస్ట్‌ చేయండని విచిత్రమైన వాదనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)