Breaking News

పాప బతకాలంటే రూ .17 కోట్ల ఇంజెక్షన్ కావాలి!

Published on Thu, 06/18/2026 - 10:41

తాడిపత్రిటౌన్‌: రెండు నెలల చిన్నారికి మాయదారి జబ్బు సోకింది. ఆసుపత్రికి తీసుకెళ్తే కోట్ల మందిలో ఒకరికి సోకే అరుదైన జబ్బు అని వైద్యులు తేల్చారు. ఆలస్యమైతే కాళ్లు, చేతులతో పాటు మిగిలిన అవయవాలు కూడా పని చేయకుండా పోతాయని, రూ. 17 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేస్తే జబ్బు నయమవుతుందని చెప్పడంతో తల్లిదండ్రుల గుండె పగిలినంత పని అయ్యింది. అంత డబ్బులేక, కళ్ల ముందే అచేతనంగా పడుకున్న బిడ్డను చూస్తూ వారు అనుభవిస్తున్న వేదన వర్ణనాతీతంగా మారింది. 

వివరాలు.. పెద్దవడుగూరు మండలం కదరగుట్టపల్లికి చెందిన నవీన్‌కుమార్‌రెడ్డి, ఇందుప్రియ దంపతులకు రెండు నెలల క్రితం బాబు జన్మించాడు. కొడుకు పుట్టాడన్న ఆనందం నెలలోనే ఆవిరవుతుందని ఆ తల్లిదండ్రులు ఊహించలేదు. ఊయల్లో పడుకొని కాళ్లు ఆడించకపోవడంతో అనుమానం వచ్చి స్థానికంగా వైద్యులకు చూపించారు. 

హైదరాబాద్‌కు వెళ్లమని చెప్పడంతో అక్కడి రెయిన్‌బో ఆసుపత్రికి బిడ్డను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు బాబుకు ఎస్‌ఎమ్‌ఏ టైప్‌–1 జబ్బు సోకినట్లు చెప్పారు. మొదట కాళ్లు, చేతులకు తర్వాత శరీరంలోని వివిధ అవయవాలకు సోకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. రూ.17 కోట్ల విలువైన ఇంజక్షన్‌ చేస్తే నయమవుతుందని చెప్పడంతో నవీన్‌కుమార్‌రెడ్డి, ఇందుప్రియలు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఆశల దీపాన్ని ఎలా రక్షించు కోవాలో తెలియక నరకయాతన అనుభవిస్తున్నారు. చిరుజీవులలైన తాము అంత డబ్బు ఎక్కడి నుంచి తెచ్చేది అంటూ కుమిలిపోతున్నారు. మనసున్న మారాజుల ఆపన్నహస్తం కోసం దీనంగా అర్థిస్తున్నారు.  

 

Videos

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)