Breaking News

వాయుగుండంగా బలపడిన తీవ్ర అల్పపీడనం

Published on Sun, 09/08/2024 - 10:45

సాక్షి, విశాఖపట్నం: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. వాయుగుండంగా బలపడిందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ వద్ద తీరాన్ని తాకే అవకాశం ఉందని పేర్కొంది. వాయుగుండం ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. రాష్ట్రంలో ఐదు జిల్లాలకు రెడ్ అలర్ట్, ఎనిమిది జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్‌ను వాతావరణ శాఖ జారీ చేసింది. మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కొనసాగనున్నాయి. తీరం వెంబడి బలమైన ఈదురు గాలులు వీస్తాయని వాతావరణ అధికారులు తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా: మున్నేరులో వరద ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్‌ అయ్యారు. మున్నేరు పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మైక్ ద్వారా అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

ఇదీ చదవండి: వరదను మించిన విపత్తు బాబే!

వరద ప్రభావిత గ్రామాలైన కంచల, ఐతవరం, దామూలూరుతో పాటు పలు గ్రామాల ప్రజలను అధికారులు అలర్ట్‌ చేశారు. ప్రస్తుతం నందిగామ వద్ద మున్నేరుకు 65,000 క్యూసెక్కుల వరద చేరుకుంది. 2 లక్షల క్యూసెక్కుల వరద వస్తే హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపైకి వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)