Breaking News

కర్నూలు ఘోర ప్రమాదం.. బస్సుపై డేంజర్‌ డ్రైవింగ్‌ చలానాలు

Published on Fri, 10/24/2025 - 10:50

సాక్షి, కర్నూలు:  ఘోర ప్రమాదానికి గురైన బస్సుపై భారీగా ట్రాఫిక్‌ జరిమానాలు పెండింగ్ ఉన్నాయని రవాణా శాఖ వెల్లడించింది. 2024 నుంచి చలానాలు పెండింగ్‌లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. జనవరి(2024)  నుంచి అక్టోబర్‌ (2025) వరకు 16 సార్లు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలింది. రూ.23120 చలానా పెండింగ్‌లో ఉంది.  హైస్పీడ్‌, డేంజర్ డ్రైవింగ్‌ కారణంగా రెండు చలానాలు బస్సుపై ఉన్నాయి. తొమ్మిది సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి ప్రవేశించడంతో జరిమానాలు పడ్డాయి. బస్సు ఫిట్‌నెస్, అనుమతులు.. ఒడిశా పరిధిలోకి వస్తాయని అధికారులు పేర్కొన్నారు. 

ఈ ప్రమాద ఘటనలో ఇప్పటి వరకు 19 మృతదేహాలను వెలికితీశారు. బస్సు ప్రమాదస్థలిలో ఫోరెన్సిక్‌ బృందం పరీక్షలు నిర్వహిస్తోంది. డీఎన్‌ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను బంధువులకు అప్పగిస్తున్నారు. ప్రమాద ఘటన నేపథ్యంలో కూకట్‌పల్లిలోని వేమూరి కావేరీ ట్రావెల్స్‌కు చెందిన కార్యాలయం వద్దకు మీడియా చేరుకోగానే సిబ్బంది మూసేస్తూ కనిపించారు. ప్రమాదంపై నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే.. ఘటనకు వీ కావేరీ ట్రావెల్స్‌ నిర్వాహకుల నిర్లక్ష్యం కూడా కారణం ఉందని అధికారుల మాటలతో స్పష్టవుతోంది.

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)