Breaking News

ఉమ్మడి కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు

Published on Fri, 09/12/2025 - 05:36

కర్నూలు(అగ్రికల్చర్‌)/వాకాడు: అల్పపీడన ప్రభావంతో గురువారం తెల్లవారుజాము నుంచి ఉమ్మడి కర్నూలు జిల్లాలో వరుణుడు ఉగ్రరూపం దాల్చాడు. ప్రధానంగా గూడూరు, మద్దికెర మండలాల్లో కుండపోత, మిగిలిన మండలాల్లో భారీ వర్షాలు కురిశాయి. గూడూరు మండలంలో కురిసిన వర్షాలకు వాగులు, వంకలు ఏకమయ్యాయి. ఫలితంగా హంద్రీకి భారీ ఎత్తున వరద నీరు చేరింది. కర్నూలు జిల్లా గూడూరులో 99 మిల్లీమీటర్లు, నంద్యాల జిల్లా కొలిమిగుండ్లలో 128.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో పత్తి, ఉల్లి పంటలకు నష్టం వాటిల్లింది.

గూడూరు మండలం పెంచికలపాడు సమీపంలోని వక్కెర వాగు పొంగిపొర్లడంతో ఉదయం నుంచి వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. సి.బెలగల్‌ మండలంలోని పోలకల్‌ గ్రామ శివారులో ఉన్న జక్కులోని వాగు నిండుగా ప్రవహించింది. ప్రయాణికులతో వెళ్లిన ఆర్టీసీ బస్సు వాగు నీటి ఉద్ధృతికి మధ్యలోనే నిలిచిపోవడంతో గ్రామస్తులు ట్రాక్టర్‌ సాయంతో బయటకు తీశారు.

మరోవైపు తిరుపతి జిల్లా వాకాడు మండలం తూపిలిపాళెం వద్ద సముద్రం గురువారం 3 మీటర్లు వరకు ముందుకు చొచ్చుకొచ్చినట్లు స్థానికులు తెలిపారు. అలల తాకిడికి తీరానికి వచ్చిన పర్యాటకులు వెనుతిరిగి వెళ్లారు. ఉదయాన్నే వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రం ఆటు పోటులతో వేట చేయలేక ఖాళీ బోట్లతో మధ్యాహా్ననికి ఒడ్డుకు చేరుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)