Breaking News

‘తుంగభద్ర, శ్రీశైలం, గోదావరి’లో వరద హోరు

Published on Sun, 07/27/2025 - 05:22

హొళగుంద/శ్రీశైలం ప్రాజెక్ట్‌/సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి శనివారం వరద నీరు పోటెత్తింది. సగటు ఇన్‌ ఫ్లో 44,348 క్యూసెక్కులుండగా.. గంటకు 46,500 క్యూసెక్కులు చొప్పున నీరు జలాశయంలోకి చేరుతోంది. మొత్తం 33 గేట్లలో 26 గేట్లను రెండున్నర అడుగుల మేర ఎత్తి 50 వేల క్యూసెక్కుల వరకు నీటిని నదికి వదులుతున్నారు.  

కాలువలకు 10 వేల క్యూసెక్కుల వరకూ విడుదల చేస్తున్నారు. తుంగభద్ర జలాశయానికి ఈ ఏడాది ముందుగానే వరద నీటి చేరిక మొదలైంది. దెబ్బతిన్న క్రస్టు గేట్లను దృష్టిలో ఉంచుకుని డ్యాం పూర్తిమట్టం 105.788 టీఎంసీలలో 80 టీఎంసీలకు నీటి నిల్వను కుదించడం తెలిసిందే. డ్యాం 105.788 టీఎంసీల నీటి సామర్థ్యంలో 77.907 టీఎంసీల నీరు నిల్వ ఉంది.     

సాగర్‌కు కొనసాగుతున్న నీటి విడుదల 
శ్రీశైలం జలాశయం నుంచి నాగార్జునసాగర్‌కు నీటి విడుదల కొనసాగుతోంది. శుక్రవారం నుంచి శనివారం వరకు జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలానికి 1,40,871 క్యూసెక్కుల వరదనీరు వచ్చి చేరింది. శ్రీశైలం నుంచి దిగువ ప్రాజెక్ట్‌లకు 156,722 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. డ్యాం పరిసర ప్రాంతాల్లో 6.80 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. నాగార్జునసాగర్‌కు క్రస్ట్‌గేట్ల ద్వారా 53,940 క్యూసెక్కులు, విద్యుత్‌ ఉత్పాదన ద్వారా 68,846 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. 

శనివారం సాయంత్రానికి శ్రీశైలం డ్యాం నీటిమట్టం 882.40 అడుగులకు చేరుకోగా.. జలాశయంలో 201.1205 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇదిలా ఉండగా, ఎగువ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి, శబరి ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. దీంతో శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి పోలవరం ప్రాజెక్టుకు 5.52 లక్షల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పోలవరం స్పిల్‌ వే 30.400 మీటర్ల ఎత్తు నుంచి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)