Breaking News

నిండా ముంచిన వాన

Published on Fri, 10/24/2025 - 05:39

సాక్షి నెట్‌వర్క్‌: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రాష్ట్రాన్ని కుదిపేస్తోంది. దీని ప్రభావంతో రెండు రోజులుగా రాష్ట్రమంతటా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. గురువారం కృష్ణా, ఎన్టీఆర్‌ జిల్లాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, రోడ్లపై వర్షం నీరు నిలిచిపోయి రాకపోకలకు ప్రజలు ఇబ్బంది పడ్డారు. వరి చిరుపొట్ట దశలో వర్షాలు పడటంతో పంట నష్టం తప్పేలా లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. 

గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. అత్యధికంగా దుగ్గిరాల మండలంలో 6.94 సెం.మీ. వర్షం కురిసింది. పల్నాడు జిల్లాలో గడచిన 24 గంటల్లో 330.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. నెల్లూరు జిల్లాలో కురిసిన వర్షాలకు పెన్నానదికి భారీస్థాయిలో నీరు చేరుతోంది. వరి, వేరుశనగ పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి.  

పొంగుతున్న వాగులు.. నిలిచిన రాకపోకలు 
ప్రకాశం జిల్లాలో కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. జిల్లాలో అత్యధికంగా రాచర్ల మండలంలో 8.5 సెం.మీ. కురిసింది. ఐదు మండలాల్లో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు. పెద్దదోర్నాల మండల పరిధిలోని తీగలేరు, ఇసుక చింతలవాగు, దొంగలవాగు, రాళ్లవాగులు పొంగటంతో వై.చర్లోపల్లి, గంటవానిపల్లె, మర్రిపాలెం తదితర గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలు పంటల్ని దెబ్బతీస్తున్నాయి. 

రొంపి­చెర్ల మండలంలో టమాట పంట పూర్తిగా దెబ్బతింది.  తిరుపతి జిల్లాలో 33.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. వైఎ­స్సార్‌ కడప జిల్లాలో 2,711 హెక్టార్లలో వరి, మొక్కజొ­న్న, కంది, మినుము, వేరుశనగ, పత్తి  పంటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి కర్నూలు జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి.  అనంతపురం జిల్లా కేంద్రంతో పాటు పరిసర మండలాల్లో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. 

బుక్కరాయసముద్రంలో 72 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరు జిల్లాలో గురువారం కుండపోత వర్షం కురిసింది. కలిదిండిలో 7.82 సెం. మి. అత్యధిక వర్షపాతం నమోదైంది. చింతలపూడి, లింగపాలెం, కామవరపుకోట మండలాల్లో వాగులు పొంగడంతో రాకపోకలు స్తంభించాయి. జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయానికి సగటు వర్షపాతం 13.5 మి.మీ.గా నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో గురువారం 23.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది.

వాగులో పడి వ్యక్తి మృతి 
జలదంకి (కలిగిరి): జీవనోపాధి నిమిత్తం వాగు దాటి కావలి వెళ్లాలనుకున్న వ్యక్తి బైక్‌తో పాటు గల్లంతై మృతి చెందాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా జలదంకి మండలంలో జరిగింది. చామదాలకు చెందిన దంపూరు మల్లికార్జున (45) తన గ్రామం నుంచి బైక్‌పై కావలికి గురువారం బయల్దేరాడు. నేరెళ్ల వాగు దాటుతుండగా బైక్‌తో పాటు ఆయన చప్టా పైనుంచి వాగులో పడిపోయాడు. 

సమాచారం అందుకున్న జలదంకి ఎస్‌ఐ సయ్యద్‌ లతీఫున్నీసా ఘటనాస్థలానికి చేరుకుని సిబ్బంది, స్థానికులతో గాలింపు చర్యలు చేపట్టారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ బృందాన్ని రప్పించి వారి సాయంతో 6 గంటల పాటు శ్రమించి మృతదేహాన్ని బయటకు తీశారు. కాగా, మల్లికార్జున కావలిలోని పూల దుకాణంలో పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఆయనకు భార్య గోవిందమ్మ, కుమార్తె (6) ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మారా్టనికి తరలించారు.  

Videos

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

Photos

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)