Breaking News

‘ఉమ్మడి అనంత’లో కుంభవృష్టి

Published on Wed, 10/23/2024 - 05:42

అనంతపురం అగ్రికల్చర్‌/పుట్టపర్తి అర్బన్‌: ఉమ్మడి అనంతపురం జిల్లాలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. రాత్రి 9 గంటలకు మొదలైన వాన జోరు మంగళవారం వేకువజాము వరకు కొనసాగింది. ఉరుములు, మెరుపులు, బలమైన గాలులతో పలు మండలాల్లో కుంభవృష్టి కురిసింది. ఏకధాటిగా నాలుగైదు గంటలపాటు భారీ వర్షం కురవడంతో చాలా మండలాల్లో వాగులు, వంకలు, చెక్‌డ్యాంలు పొంగి ప్రవహిస్తున్నాయి. రాప్తాడు మండలం బండమీదపల్లి చెరువు కట్ట తెగిపోయి దిగువ ప్రాంతానికి వరద పోటెత్తడంతో దాదాపు 70 గొర్రెలు కొట్టుకుపోయాయి. 

రామగిరి, చెన్నేకొత్తపల్లి, ధర్మవరం, పెనుకొండ, కొత్తచెరువు, పుట్టపర్తి ప్రాంతాల్లో భారీ వర్షం కురవడంతో చిత్రావతి, వంగపేరు, కుషావతి, జయమంగళి నదులతోపాటు పలు చెరువులు పొంగిపొర్లుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఖరీఫ్‌లో సాగు చేసిన వరి, వేరుశనగ, పత్తి, ఆముదం, కంది, కొర్ర, మొక్కజొన్న తదితర పంటలు వందలాది ఎకరాల్లో దెబ్బతినడంతో రైతులు నష్టపోయారు. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం హంపాపురం గ్రామానికి చెందిన రైతు రమణారెడ్డి రెండున్నర ఎకరాల్లో సాగు చేసిన ద్రాక్ష తోట మొత్తం నేలమట్టమయ్యింది. 

రూ.20 లక్షలకు పైగా నష్టపోయినట్లు రైతు వాపోయారు. శ్రీ సత్యసాయి జిల్లా కనగానపల్లిలో రికార్డు స్థాయిలో 198.2 మి.మీ. వర్షపాతం నమోదైంది. అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గంలో 89.4 మి.మీ., కంబదూరులో 65.4 మి.మీ., ఆత్మకూరులో 60 మి.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. కాగా.. రానున్న రెండు రోజులు ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకా­శం ఉందని అధికారులు తెలిపారు. 

పండమేరు ఉగ్రరూపం... నీట మునిగిన పలు కాలనీలు 
ఎగువన భారీ వర్షాలు కురవడంతోపాటు కనగానపల్లి చెరువుకట్ట తెగిపోవడంతో పండమేరు ఉధృతంగా ప్రవహించింది. పండమేరు వెంబడి ఉన్న అనంతపురం నగర శివారులోని గురుదాస్‌ కాలనీ, ఆటో కాలనీ, వనమిత్ర పార్క్‌ వెనుక కాలనీలు, రామకృష్ణ కాలనీ, కళాకారుల కాలనీ, బృందావన కాలనీ, పరిటాల సునీతమ్మ కాలనీ, దండోరా కాలనీ, రాజరాజేశ్వరి కాలనీలు నీట మునిగాయి. సుమారు 300 కుటుంబాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. వరద­పై అధికారులు తమకు ముందస్తు సమాచారం ఇవ్వలేదని, ఫలితంగా కట్టుబట్టలతో మిగి­లామని పలువురు బాధితులు ఆవేదన వ్యక్తంచేశారు.

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : ఎగ్జిబిషన్‌ మైదానంలో సందడిగా దత్తన్న అలయ్‌ బలయ్‌ (ఫొటోలు)

+5

ప్రభాస్ హీరోయిన్ కొత్త ఫొటోలు! (ఫొటోలు)