ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం
Breaking News
తెలుగు రాష్ట్రాలకు భారీ వర్ష సూచన
Published on Fri, 09/12/2025 - 10:28
సాక్షి, హైదరాబాద్/విజయవాడ: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. రేపటి వరకు అల్పపీడనంగా మారే అవకాశం ఉంది. ఇవాళ, రేపు ఏపీలో పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. 40-50 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని పేర్కొంది.
పశ్చిమ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని.. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి, తూర్పుగోదావరి, కాకినాడ, అంబ్కేదర్ కోనసీమ, శ్రీసత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతవరణ శాఖ పేర్కొంది.
తెలంగాణలో నాలుగు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, నల్గొండ, సూర్యాపేట,రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, వికారాబాద్, కామారెడ్డి, మహబూబ్నగర్, గద్వాల్ జిల్లాలో అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Tags : 1