Breaking News

తిరుపతిలో దంచికొడుతున్న వర్షం..

Published on Fri, 12/13/2024 - 07:37

సాక్షి, తిరుపతి: ఏపీలోని పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరద నీటిలో చెరువులు, నదులు పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయం కోసం కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుచేశారు.

తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. ఈ నేపథ్యంలో నేడు జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలకు, జూనియర్ కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటించారు జిల్లా ఇంచార్జ్‌ కలెక్టర్ శుభం భన్సల్‌. మరోవైపు.. వరద నీటి భారీగా వచ్చి చేరుతుండటంతో స్వర్ణముఖి నది పరవళ్లు తొక్కుతోంది. బ్యారేజ్ వద్ద 7 గేట్లు ఎత్తి 20 వేల క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు అధికారులు. బాలిరెడ్డిపాలెం-గంగన్నపాలెం మధ్య స్వర్ణముఖి నది బ్రిడ్జిపై నీటి ప్రవాహం ఏడు అడుగులకు చేరుకుంది. దీంతో, 10 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. స్వర్ణముఖి నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

ఇదిలా ఉండగా.. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని అధికారులు సూచించారు. రోడ్లు, ఆనకట్టలపై నీరు ప్రవహిస్తున్న సమయంలో ఎవరు దాటే ప్రయత్నం చేయవద్దని హెచ్చరించారు. విపత్తును ఎదుర్కొనేందుకు సన్నద్ధంగా ఉండాలని సిబ్బందిని జిల్లా యంత్రాంగం అప్రమత్తం చేసింది. అత్యవసర సహాయం కోసం కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశారు. జిల్లా కలెక్టరేట్‌లో, మండల, డివిజన్, జిల్లా స్థాయిలో సైక్లోన్ కంట్రోల్ రూమ్ ఏర్పాటును చేశారు.  

  • జిల్లా కలెక్టరేట్ సైక్లోన్ కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007

  • కలెక్టరేట్  తుఫాను కంట్రోల్ రూమ్ నెంబర్: 0877-2236007

  • గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9849904062

  • సూళ్లూరుపేట ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 9441984020

  • తిరుపతి ఆర్‌డీవో కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 7032157040

  • శ్రీకాళహస్తి ఆర్‌డీవో  కార్యాలయం-కంట్రోల్ రూమ్ నెం: 6281156474

    👉:​​​​​​​ (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)
     

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)