Breaking News

అమ్మా నీ పాడి మోసేందుకు రాలేకపోతున్నా.. క్షమించు..!

Published on Thu, 07/17/2025 - 13:54

నంద్యాల: ‘అమ్మా నిన్ను చూసేందుకు రాలేకపోతున్నా.. నీ కడ చూపునకు నోచుకోలేనంతా దూరంలో ఉన్నాను. నీ పాడి మోయలేక పోతున్నా.. నన్ను క్షమించు’ అంటూ ఓ తనయుడి ఆవేదన పలువురిని కంటతడి పెట్టించింది. ఉపాధి కోసం దుబాయ్‌లో ఉన్న కుమారుడు తల్లి అంత్యక్రియలకు రాలేక ఎంతో కుమిలిపోయాడు. వీడియో కాల్‌లో తన తల్లి చివరి చూపును వీక్షించి కన్నీటిపర్యంతమయ్యాడు. క్రిష్టిపాడు గ్రామానికి చెందిన పగిడి జయమ్మ(48) గత కొంతకాలంగా ఆనారోగ్యంతో ఇబ్బందులు పడేది. 

ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించి ఆమె మంగళవారం మృతి చెందింది. గత ఏడేళ్ల క్రితం భర్త కూడా మృతి చెందాడు. ఇద్దరు కూతుళ్లు సారిక, ఓళమ్మ, ఒక్కగానొక్క కొడుకు ఓబులేసు ఉన్నారు. కొడుకు దుబాయ్‌లో కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తల్లిమరణ వార్త తెలుసుకున్న తనయుడు ఆందోళనకు గురయ్యాడు. దీంతో బంధువులు వీడియో కాల్‌ చేసి అతని తల్లి అంత్యక్రియలను చూయించారు. తాను బతికుండి కన్న తల్లి పాడి మోయలేక పోతున్నానని.. కన్నీటి పర్యంతం అయ్యాడు. ఈ ఘటన గ్రామంలో పలువురిని కంటతడి పెట్టించింది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)