Breaking News

కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్ల జీవితాల్లో వెలుగులు 

Published on Tue, 04/02/2024 - 03:09

పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా): వైద్యారోగ్య శాఖలో ఇన్నాళ్లూ కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసిన హెల్త్‌ అసిస్టెంట్‌ ఉద్యోగుల జీవితాల్లో రాష్ట్ర ప్రభుత్వం వెలుగులు నింపింది. వారిని రెగ్యులర్‌ ఉద్యోగులుగా క్రమబదీ్ధకరించింది. దీంతో వారి జీవితాల్లో, కుటుంబాల్లో సంతోషం వెల్లివిరిసింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు సమీకృత గిరిజనాభివృద్ధి సంస్థ (ఐటీడీఏ) పరిధిలో 2006లో 49 మంది కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లుగా రూ.5 వేల వేతనానికి విధుల్లో చేరారు.

2012లో మరో 36 మంది వచ్చారు. గత టీడీపీ ప్రభుత్వం వీరి సమస్యలను ఏనాడూ పట్టించుకోలేదు. దీంతో వీరంతా 20 ఏళ్లుగా చాలీచాలని జీతాలతో, ఉద్యోగ భద్రత కరువై వెట్టిచాకిరి చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో వీరి వేతనాలు కేవలం రూ.25,400 మాత్రమే. దీంతో కుటుంబ పోషణ కూడా కష్టంగా మారింది. వేతనాల పెంపు కోసం ఎన్నోసార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టినా టీడీపీ ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.   

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాకే న్యాయం 
2019లో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక కొద్ది నెలలకే కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్ల వేతనాలను భారీ స్థాయిలో పెంచింది. రూ.25,400గా ఉన్న వేతనాన్ని సీఎం జగన్‌ ఏకంగా రూ.32,460కు పెంచారు.  గత ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో భాగంగా 2014 కంటే ముందు ఉద్యోగంలో చేరిన కాంట్రాక్ట్‌ హెల్త్‌ అసిస్టెంట్లను ప్రభుత్వం రెగ్యులర్‌ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది మార్చి 10న పాడేరు ఐటీడీఏ పరిధిలో 11 మండలాల్లో పనిచేస్తున్న 85 మందికి రెగ్యులైజేషన్‌ ఆర్డర్లను అందజేశారు. దీంతో వారంతా సోమవారం ఆయా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యాధికారుల వద్దకు వెళ్లి వాటిని అందించారు. ఏప్రిల్‌ 1 నుంచి రెగ్యులర్‌ ఉద్యోగులుగా మారడంతో ఉద్యోగులు ఒకరినొకరు స్వీట్లు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.  నెలకు సుమారు రూ.50 వేలు వేతనంగా అందుకోనున్నారు. సీఎం జగన్‌ వల్లే తమ జీవితాల్లో వెలుగులు నిండాయని,  ఆయనకు రుణపడి ఉంటామంటున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)