Breaking News

నాలుగో సింహం... నవ్వులపాలు

Published on Tue, 08/19/2025 - 05:18

ఆళ్లగడ్డ: కొందరు పోలీసుల తీరు వల్ల నాలుగో సింహం నవ్వులపాలవుతోంది. పోలీసు శాఖ ప్రతిష్ట మంటకలుస్తోంది. ఇందుకు ఆళ్లగడ్డ పోలీస్‌ సబ్‌ డివిజన్‌ పరిధిలోని దొర్నిపాడు పోలీస్‌ స్టేషన్‌లో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ తీరే తాజా నిదర్శ­నం. ఆయన యూనిఫాం ధరించే పూటుగా మద్యం తాగి పలు సినిమా పాటలకు రీల్స్‌ చేస్తున్నాడు. కూటమి ప్రభుత్వం తెచ్చిన మద్యం పాలసీ బ్రహా్మండంగా ఉంది... పేదవాడికి తక్కువ ధరకే కోరుకున్న మద్యం అందుతోంది... నేను ఫుల్లుగా తాగుతున్నాను.

మీరూ తాగండి.. అంటూ రీల్స్‌(విడియోలు) చేసి వాటిని ఇన్‌స్టాగ్రాం, ఫేస్‌బుక్, వాట్సాప్‌ గ్రూపులు, ఇతర సోషల్‌ మీడియా మాధ్యమాల్లో పెడుతున్నాడు. పేదవాడి ముఖంలో చిరునవ్వు కోసం.. అంటూ కొందరికి మద్యం సీసాలు పంచుతూ కూడా రీల్స్‌ చేశాడు. ఆయన కూటమి ప్రభుత్వ మద్యం విధానానికి అనధికార బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు. సోషల్‌ మీడియాలో హెడ్‌ కానిస్టేబుల్‌ లక్ష్మీనారాయణ వీడియోలు వైరల్‌గా మారాయి.

మద్యం వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత గల పోలీసే ఇలా అత్యంత బాధ్యతారాహిత్యంగా మద్యం తాగి.. మీరూ తాగండి... అంటూ రీల్స్‌ చేస్తుండటంపై ప్రజలు విస్మయం వ్యక్తంచేస్తున్నారు. అతని రీల్స్‌ను ఉన్నతాధికారులు చూసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఈ రీల్స్‌ చూసి యువత చెడిపోయే ప్రమాదం ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)