Breaking News

టీడీపీ నేతల వేధింపులతో దళిత మహిళ ఆత్మహత్యాయత్నం

Published on Wed, 09/24/2025 - 05:09

సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అధికార మదంతో గ్రామాల్లో టీడీపీ నేతలు రెచ్చిపోతూనే ఉన్నారు. పొదుపు సంఘంలో సభ్యురాలైన ఓ దళిత మహిళను అసభ్యకరంగా దూషించడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురై నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది. సెల్ఫీ వీడియోలో తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తూ టీడీపీ నాయకుల పేర్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆ మహిళ పరిస్థితి విషమంగా ఉంది. మంగళవారం వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. 

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం దొరువుపాళెం ఎస్సీ కాలనీకి చెందిన దారా విజయమ్మను స్థానిక టీడీపీ నేతలు విక్రమ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, శ్రీనివాసులు దుర్భాషలాడడంతోపాటు వేధింపులకు గురిచేశారు. అంతటితో ఆగక ఆమెపై పోలీసు కేసు పెట్టించారు. పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి ఎస్సై ద్వారా కూడా మందలించారు. దీంతో ఆమె చనిపోవాలని నిర్ణయించుకుంది. ‘ఏ తప్పు చేయని నన్ను తోటపల్లిగూడూరు వెలుగు సీసీ కోసం ఇబ్బంది పెడుతున్నారు. 

దొరువుపాళెం గ్రామానికి చెందిన సునీత అనే వీఓఏ.. మహిళల పొదుపు సొమ్ము సుమారు రూ.18 లక్షలు దుర్వినియోగం చేసింది. దీంతో ఆమెను తొలగించి, మా బంధువు దారా కోటేశ్వరమ్మను నియమించారు. అయితే కూటమి పార్టీకి చెందిన స్థానిక నాయకులు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపై ఒత్తిడి తెచ్చి కోటేశ్వరమ్మను తొలగించారు. తిరిగి సునీతనే వీఓఏగా నియమించారు. 

ఈ అన్యాయాన్ని నేను పలుమార్లు ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో నాపై టీడీపీ నాయకులు కక్ష కట్టి తీవ్ర వేధింపులకు గురి చేశారు. అందుకే చనిపోవాలనుకుంటున్నా. నా చావుకు అధికార టీడీపీ నాయకులే కారణం’ అంటూ ఆమె సెల్ఫీ వీడియోలో వివరిస్తూ నిద్ర మాత్రలు మింగారు. అనంతరం ఆమె కుప్పకూలిపోవడం గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన నెల్లూరులోని జీజీహెచ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)