Breaking News

‘నేతన్న భరోసా’ ఏమైంది బాబూ!

Published on Mon, 01/05/2026 - 03:49

సాక్షి, అమరావతి: చేనేత రంగానికి చంద్రబాబు ఇచ్చిన ఎన్నికల హామీలను తక్షణం అమలు చేయా­లని చేనేత సంఘాల రౌండ్‌ టేబుల్‌ సమావేశం డిమాండ్‌ చేసింది. ఏడాదికి రూ.25 వేల చొప్పున నేతన్న భరోసా పథకం కింద చంద్రబాబు ప్రభు­త్వం అందించాలని, చేనేత కార్మికులకు 200 యూ­నిట్ల చొప్పున ఉచిత విద్యుత్‌ ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాలని కోరింది. చేనేత రంగానికి సంబంధించి 18 ప్రధాన డిమాండ్ల సాధన కోసం 15 చేనేత సంఘాల సంయుక్త ఆధ్వర్యంలో విజయ­వా­డ­లో ఆదివారం రౌండ్‌టేబుల్‌ సమావే­శాన్ని నిర్వ­హించారు.

చేనేత రంగాన్ని ఆదుకునేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లో కేటాయింపులు జరపా­లని సమావేశానికి హాజరైన నాయకులు డి­మాండ్‌ చేశారు. చేనేత సహకార సంఘాలకు ప్రభు­త్వం చె­ల్లించాల్సిన రూ.203 కోట్ల బకాయిలు విడు­దల చే­యాలని, రైతుల నుంచి ధాన్యాన్ని కొను­గోలు చేసి­నట్టుగానే నిల్వ ఉన్న చేనేత వస్త్రా­లను కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని, జీఎస్‌­టీని రద్దు చేయాలని, చిలప నూలు, పట్టు, రంగులు, రసా­య­నాలు సబ్సిడీ ధరలకు అందించాల­ని, చేనేత రంగానికి పావలా వడ్డీకే రుణా­లు ఇవ్వా­లని, నేత­న్నలకు 3 సెంట్ల చొప్పున భూమి ఇచ్చి ఇ­ళ్లు నిర్మించాలని రౌండ్‌ టేబుల్‌ సమావేశం తీర్మానించింది.

ఫిబ్రవరి 23న చలో మంగళగిరి
రాష్ట్రవ్యాప్తంగా చేనేత రంగానికి సంబంధించిన ప్రధాన డిమాండ్ల పరిష్కారానికి ఫిబ్రవరి 23న చలో మంగళగిరి నిర్వహించాలని రౌండ్‌టేబుల్‌ సమా­వేశం నిర్ణయించింది. దీనికోసం రాష్ట్ర చేనేత సంఘాల జేఏసీ ఏర్పాటు చేసింది. జేఏసీ కో–కన్వీ­నర్లుగా బండారు ఆనంద ప్రసాద్, పిల్లలమర్రి నాగే­శ్వ­రరావు, బుధవారపు బాలాజీ, కట్టా దుర్గారావు ఎంపికయ్యారు. సమావేశంలో చేనేత సంఘాల జాతీ­య, రాష్ట్ర నేతలు నమాల శివరామప్రసాద్, పిల్లల­మర్రి బాలకృష్ణ, దామెర్ల శ్రీకృష్ణ, ముప్పన వీర్రాజు, వీరభద్రేశ్వ­రరావు, సుబ్రహ్మణ్యే­శ్వరరావు, చింతా శ్రీనివాసులు, సాయి ఓంకారయ్య, సమతం రమణ మహేష్‌ మాట్లాడారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)