దళిత యువతిపై జిమ్‌ ట్రైనర్‌ అఘాయిత్యం

Published on Tue, 07/21/2026 - 05:57

సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్‌): దళిత యువతికి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడికి పాల్పడి.. ఆమె నగ్న ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్‌ చేస్తూ దఫదఫాలుగా నగదు దోచుకుంటున్న జిమ్‌ ట్రైనర్‌పై విజయవాడ సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేశారు. విజయవాడ సీతారాంపురానికి చెందిన దళిత యువతి (23) ప్రైవేటు పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తోంది. గత ఏప్రిల్‌లో ఆమెకు ఇన్‌స్ట్రాగామ్‌ ద్వారా దేవినగర్‌కు చెందిన షేక్‌ అబ్దుల్‌ఖాదర్‌ పరిచయమయ్యాడు. తాను జిమ్‌ ట్రైనర్‌నని, లావు తగ్గించి సన్నబడేలా చేస్తానని మాటలు కలిపాడు.

తాను పనిచేస్తున్న సత్యనారాయణపురంలోని రాక్‌ ఫిట్‌నెస్‌ వరల్డ్‌ జిమ్‌కి రమ్మని పిలిచాడు. అతని మాటలు నమ్మిన యువతి అక్కడ చేరింది. కొద్దిరోజుల తర్వాత తనకు సమీపంలోని ఒక హోటల్‌లో రూమ్‌ ఉందని.. అందులోనే ప్రొటీన్‌ షేక్‌లు ఉన్నాయని.. అక్కడకు వస్తే వాటిని ఇస్తానని నమ్మించి తీసుకెళ్లాడు. రూమ్‌లో సిద్ధంగా ఉంచిన ప్రోటీన్‌ షేక్‌ తాగమని ఇవ్వడంతో ఆమె తాగింది. తాగిన కొద్దిసేపటికి యువతి మత్తులో జారుకుంది. మూడు గంటల తరువాత మెలకువ వచ్చి చూడగా తన వంటిపై దుస్తులు లేకుండా ఉండటంతో భయంతో కేకలు వేసింది.

 ‘ఇదంతా ఇక్కడ కామన్‌. నా వద్ద నీ న్యూడ్‌ ఫొటోలు, వీడియోలు ఉన్నాయి. విషయం ఎవరికైనా చెబితే వాటిని సోషల్‌ మీడియాలో పెడతా’నని అబ్దుల్‌ ఖాదర్‌ బెదిరించి పలుమార్లు లైంగిక దాడిచేశాడు. అనంతరం తనకు ఐఫోన్‌ కావాలని.. డబ్బులు కావాలంటూ బ్లాక్‌మెయిల్‌ చేయడంతో అన్నీ చేసింది. అయినా ఆమెను వదలకుండా బ్లాక్‌మెయిల్‌ చేస్తూ వేర్వేరు చోట్ల అత్యాచారం చేశాడు.

పెళ్లిచేస్తామని సర్దిచెప్పి..
అబ్దుల్‌ఖాదర్‌ వేధింపులు భరించలేని యువతి గతనెల 23న తన స్నేహితురాలిని తీసుకుని అతడి ఇంటికెళ్లింది. విషయాన్ని అతడి తల్లికి చెప్పగా ఇద్దరికి పెళ్లి చేస్తామని నచ్చజెప్పి పంపించేసింది. ఆ తరువాత నుంచి మాటమార్చి కులం ప్రస్తావన తెస్తూ దుర్భాషలాడింది. మరోవైపు నిందితుడు తన ఫోన్‌లోని నగ్న ఫొటోలు, వీడియోలను జిమ్‌లోని ఇతరులకు చూపిస్తుండడంతో బాధితురాలు ఆదివారం రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేసింది.  అబ్దుల్‌ఖాదర్‌ పరారీలో ఉండటంతో అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)