Breaking News

విశాఖలో కూటమి ‘మహా’ కుట్ర

Published on Thu, 08/08/2024 - 06:31

సాక్షి, విశాఖపట్నం: మహా విశాఖ నగర పాలక సంస్థలో జరిగిన స్టాండింగ్‌ కమిటీ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో టీడీపీ కూటమి కుట్ర రాజకీ­యాలకు తెరతీసింది. కూటమి కార్పొరేటర్లకు జీవీఎంసీ కమిషనర్‌ సంపత్‌కుమార్‌ మద్దతు పలుకుతూ.. చెల్లని ఓట్లను కూడా పరిగణనలోకి తీసుకుని.. 10కి 10 స్థానాల్లోనూ టీడీపీ విజయం సాధించినట్లు ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక తొలిసారిగా జీవీఎంసీలో జరుగుతున్న ఎన్నికలు కావడంతో.. టీడీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

                                               కార్పోరేటర్లను బలవంతంగా లాక్కెళుతున్న పోలీసులు

కుట్రలు చేసైనా విజయం సాధించాలనే ఉద్దేశంతో.. కార్పొరేటర్లకు రూ.5 లక్షల వరకూ డబ్బులిచ్చి మరీ ఓట్లు బహిరంగంగానే కొనుగోలు చేశారు. తమకు మద్దతిస్తున్న కార్పొరేటర్లను భీమిలిలోని రిసార్టులో మంగళవారం రాత్రి మొత్తం అక్కడే బస చేయించి.. ఉ.11 గంటల సమయంలో ఓటింగ్‌కు బస్సులో తీసుకొచ్చారు. మరోవైపు.. టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు కొందరు వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లకు నేరుగా ఫోన్లుచేసి డబ్బులు పంపిస్తున్నట్లు చెప్పి ఓట్లు కొనుగోలు చేశారు. 


                             కన్నీటి పర్యంతమవుతున్న వైఎస్సార్‌సీపీ కార్పోరేటర్‌ రోహిణి


బ్యాలెట్‌ పేపర్లపై కలర్‌ పెన్సిళ్లతో గుర్తులు..
ఇక డబ్బులు తీసుకున్న వారు తమకు ఓట్లు వేశారా లేదా అనేది తెలుసుకునేందుకు కలర్‌ పెన్సిళ్లతో బ్యాలెట్‌ పేపర్‌పై అనధికారికంగా గీతలు గీశారు. వాస్తవానికి.. బ్యాలెట్‌ పేపర్‌పై పెన్ను, పెన్సిల్, స్కెచ్‌ గీతలుంటే కచ్చితంగా ఆ ఓట్లు చెల్లుబాటు కావన్న నిబంధనలున్నా కమిషనర్‌ మాత్రం పూర్తిగా పక్కా టీడీపీ కార్యకర్తలా వ్యవహరించారు. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు ఆ ఓట్లు చెల్లుబాటు కావని చెబుతున్నా బేఖాతరు చేస్తూ టీడీపీ కార్పొరేటర్లు 10 మందీ విజయం సాధించినట్లు ప్రకటించారు.

దీంతో వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లు కమిషనర్‌ తీరుపై మండిపడ్డారు. పోర్టికోలో బైఠాయించారు. ముందుగానే కుట్ర పన్ని గెలుపొందాలని స్కెచ్‌ వేసిన టీడీపీ పెద్దఎత్తున పోలీసు బలగాల్ని రంగంలోకి దించి.. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్లను జీవీఎంసీ నుంచి బయటికి పంపించేశారు. అక్రమంగా విజయం సాధించిన టీడీపీ వ్యవహారం, కమిషనర్‌ వ్యవహరించిన తీరుపై న్యాయపోరాటం చేస్తామని మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్, కటుమూరి సతీష్, ఫ్లోర్‌లీడర్‌ బానాల శ్రీను, ఇతర కార్పొరేటర్లు తెలిపారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)