Breaking News

సీఎం చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్తత

Published on Mon, 07/01/2024 - 10:54

అమరావతి, సాక్షి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉండవల్లి నివాసం వద్ద సోమవారం ఉదయం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో పనిచేస్తున్న టీచర్లు ఆయన నివాసం వద్ద ఆందోళన చేపట్టారు. డీఎస్సీ రిక్రూట్‌మెంట్‌ నేపథ్యంలో.. తమ కుటుంబాలు రోడ్డున పడతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు వాళ్లు. 

డీఎస్సీ నుంచి గురుకులాల 1,143 పోస్టులు మినహాయించాలన్నది వాళ్ల ప్రధాన డిమాండ్‌.  పదిహేనేళ్లుగా ఔట్‌ సోర్సింగ్‌ విధానంలో తాము పని చేస్తున్నామని, ఇప్పుడు డీఎస్పీ నోటిఫికేషన్‌ ద్వారా తమ కుటుంబాలు రోడ్డున పడతాయని, పరీక్ష రాయడానికి తమకు ఏజ్‌ లిమిట్‌ కూడా దాటిపోయిందని అంటున్నారు వాళ్లు. 

శనివారం టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబును కలిసేందుకు ఎదురుచూశామని, అక్కడ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఇక్కడికి వచ్చామని టీచర్లు చెబుతున్నారు. ఈ క్రమంలో వాళ్లను అక్కడి నుంచి పంపించేందుకు భద్రతా సిబ్బంది ప్రయత్నించగా.. ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సీఎం చంద్రబాబుకు తమ సమస్య వివరించిన తరువాతే కదులుతామని అంటున్నారు వాళ్లు.

Videos

లోకల్ వార్ రెండో దశ మొదలు

ఘోర రోడ్డు ప్రమాదం..ఎగిరిబడ్డ వ్యక్తి

YSRCP MPTC అభ్యర్థిపై దాడి పోలీస్ స్టేషన్ కు YS అవినాష్ రెడ్డి

Ramchandrapuram : కూటమిని చిత్తుచిత్తుగా ఓడిస్తాం

నామినేషన్ పత్రాలు చించేసిన TDP గూండాలు అక్కడ ఎన్నిక వాయిదా

Kurnool: YSRCP మహిళలపై TDP మహిళలు దాడి

ఖాకీ చొక్కాల మాటున టీడీపీ గూండాలు.. ఎన్నికలు జరిగితే 100% YSRCPదే గెలుపు..

70MMలో చంద్రముఖి బాబు నిజస్వరూపం

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)