Breaking News

గెస్ట్‌ ఫ్యాకల్టీకి తీపి కబురు

Published on Fri, 09/09/2022 - 04:47

సాక్షి ప్రతినిధి, విజయవాడ: రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో 8 ఏళ్లుగా పని చేస్తున్న గెస్ట్‌ ఫ్యాకల్టీకి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. మొత్తం 1,074 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీలకు 2022–23 సంవత్సరానికి 10 నెలలు రెన్యువల్‌ చేసింది. ఈ మేరకు విద్యాశాఖ జీవో నంబరు 147 విడుదల చేసింది. వీరికి గత టీడీపీ ప్రభుత్వం నుంచి ప్రతి విద్యా సంవత్సరంలో కేవలం 3 నుంచి 5 నెలలకు గంటల ప్రాతిపదికన పీరియడ్‌కు రూ.150 చొప్పున ఇచ్చేవారు.

నెలకు గరిష్టంగా రూ.10,000 మాత్రమే ఇచ్చేవారు. అదీ.. కళాశాల ఎక్యుములేషన్‌ ఫండ్‌ ఆధారంగా వేతనం చెల్లించేలా ప్రొసీడింగ్స్‌ ఇచ్చేవారు. ఎక్యుములేషన్‌ ఫండ్‌ లేని కారణంతో  2017–18, 2018–19, 2019–2020 సంవత్సరాలకు మూడేళ్ల పాటు 87 కళాశాలల్లో లెక్చరర్లు వేతనాలు అందక తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వీరి కష్టాలకు చెక్‌ పెడుతూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం రెన్యువల్‌ కాలాన్ని పెంచడంతోపాటు ఎక్యుములేషన్‌ ఫండ్‌తో సంబంధం లేకుండా వేతనాలనూ విడుదల చేసింది. 

సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన గెస్ట్‌ ఫ్యాకల్టీ 
ప్రభుత్వ నిర్ణయం పట్ల రాష్ట్రంలోని గెస్ట్‌ ఫ్యాకల్టీలు హర్షం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. తమ కష్టాలను సానుకూలంగా విని సహకరించిన విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు ధన్యవాదాలు తెలిపారు.

మాకు న్యాయం జరిగింది... 
ప్రభుత్వం గెస్ట్‌ ఫ్యాకల్టీల సమస్యలను గుర్తించి 10 నెలల రెన్యువల్‌ విడుదల చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పాలనలో మాకు న్యాయం జరిగింది. ముఖ్యమంత్రికి, విద్యా శాఖ మంత్రికి మా గెస్ట్‌ ఫ్యాకల్టీ సభ్యులందరి తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. 
– రాజేష్‌ పట్టా, గెస్ట్‌ ఫ్యాకల్టీ (ఫిజిక్స్‌), నందిగాం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, శ్రీకాకుళం జిల్లా 

సంతోషంగా ఉంది 
ఎన్నో ఏళ్లుగా నిరీక్షిస్తున్న మాకు ప్రభుత్వం రెన్యువల్‌ ఇవ్వడం చాలా ఆనందంగా ఉంది. విద్యా శాఖ మంత్రి దృష్టికి మా సమస్యలు తీసుకువెళ్లినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. మా విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లి రెన్యువల్‌ చేయించారు.
– పట్నాన శ్రీనివాసరావు, గెస్ట్‌ ఫ్యాకల్టీ,కామర్స్, ప్ర.జూ. కళాశాల, జి.సిగడాం 

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)