Breaking News

గోదావరిలో జనజాతర.. జగన్‌ వస్తే ఉప్పెనే

Published on Thu, 04/18/2024 - 11:35

సాక్షి, పశ్చిమగోదావరి: మేమంతా సిద్ధం బస్సు యాత్రకు విశేష స్పందన లభిస్తోంది. 17వ రోజు మేమంతా సిద్ధం బస్సుయాత్ర తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక మీదగా కొనసాగుతోంది. సీఎం జగన్‌కు ప్రజల్లో అమితాదరణ లభిస్తోంది. కిలోమీటర్ల కొద్దీ వీరాభిమానులు వెన్నంటి వస్తున్నారు.  రోజుల తరబడి, జిల్లాలు దాటి, ఎండా, వాన లెక్క చేయకుండా, వ్యయప్రయాసలను పట్టించుకోకుండా వేలాది కిలోమీటర్ల మేర సీఎం జగన్‌ వెంట ప్రయాణం చేస్తున్నారు. నిప్పులు చెరుగుతున్న మండుటెండలను లెక్క చేయకుండా వేలాది మంది వేచి చూసి మరీ సీఎం జగన్‌కు స్వాగతం పలుకుతున్నారు. రావులపాలెం సెంటర్‌లోనయితే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జనం ఉప్పెనలా తరలివచ్చి అఖండ స్వాగతం పలికారు. భారీగా జనం పోటెత్తడంతో జాతీయ రహదారి పూర్తిగా కిక్కిరిసిపోయింది.


ఎక్కడో నాసికా త్రయంబకంలో పుట్టిన గోదారి....
పిల్ల కాలువలతో మొదలుపెట్టి...

వాగులు, వంకలు, ఏరులు, నదులన్నీ ఇచ్చే శక్తితో పోటెత్తిపోతుంది...
‘మేమంత సిద్ధం’ బస్సు యాత్ర కూడా అంతే!

ఇడుపుల పాయలో మొదలైన జనవాహిని కూడా..
అంతకంతకూ బలం పుంజుకుంటుంది...
ప్రతి సభ జన సంద్రాన్ని తలపిస్తోంది.


తణుకు, రావులపాలెం, జొన్నాడ, పొట్టిలంక, కడియపులంక, వేమగిరి,    
రాజానగరం మీదుగా ST రాజపురం చేరే..
నేటి యాత్రలోనూ గోదారోళ్ల అభిమానం, అప్యాయతలు కళ్లకు కడుతున్నాయి!

 

చిన్నా పెద్ద తేడా లేదు... రాజు పేద అన్న అంతరమూ కానరాదు.
ఎటు చూస్తే అటు పండుగ వాతావరణం. చిరునవ్వుల కేరింతలు..
పెత్తందార్లపై పోరుకూ మేమూ సిద్ధం అంటూ నినాదాలు!
ఈ ఉత్సవం... ఐదేళ్ల ఉజ్వల భవిష్యత్తుకు శ్రీకారం చుడుతున్నట్లే!


మరోవైపు జననేత తమ ప్రాంతానికి వస్తున్నారని తెలియడం ఆలస్యం.. బస్సుయాత్ర వెళ్లే రహదారికి తమ గ్రామం దూరంగా ఉన్నాసరే అవ్వాతాతలు, అక్కచెల్లెమ్మలు, చిన్నారులు, యువత ప్రతికూల వాతావరణంలోనూ కిలోమీటర్ల కొద్దీ నడిచి వచ్చి జగన్‌కు అఖండ స్వాగతం పలుకుతున్నారు. పసిపిల్లలతో పాటు వచ్చిన తల్లులు, బాలింతలు ఇలా ఒకరేమిటి గంటల తరబడి జగన్‌ను చూసేందుకు నిరీక్షిస్తున్నారు. పగలూ రాత్రి తేడా లేకుండా వీధుల్లోకి పోటెత్తుతున్నారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)