Breaking News

ప్రతి ఇంటా విశ్వాసం.. ‘జగనన్నే మా భవిష్యత్తు’కు విశేష స్పందన

Published on Thu, 04/13/2023 - 05:18

సాక్షి, అమరావతి : వైఎస్సార్‌సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోంది. బుధవారం ఆరవ రోజు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల సమన్వయకర్తలు, సచివాలయాల కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఆయా ప్రాంతాల్లో ప్రజలు ఆత్మీయ స్వాగతం పలికారు. ఇదివరకెన్నడూ లేని రీతిలో గత 46 నెలలుగా సీఎం వైఎస్‌ జగన్‌ సంక్షేమ పథకాలు, సుపరిపాలన ద్వారా మేలు చేశారంటూ అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, అన్నదమ్ములు ప్రశంసించారు.

2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చిన చంద్రబాబు.. అధికారంలోకి వచ్చాక ఒక్క హామీని కూడా అమలు చేయకుండా తమను మోసం చేశారని అన్ని వర్గాల ప్రజలు మండిపడ్డారు. గత ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేస్తూ తాము పెట్టుకున్న నమ్మకాన్ని సీఎం వైఎస్‌ జగన్‌ నిలబెట్టుకున్నారని కొనియాడారు. ‘మా నమ్మకం నువ్వే జగన్‌’ అని నినదించారు. మళ్లీ వైఎస్‌ జగనే అధికారంలోకి రావాలని ఆకాంక్షిస్తూ ప్రజా మద్దతు పుస్తకంలో తమ అభిప్రాయాలను నమోదు చేయించి, రసీదు తీసుకున్నారు.

ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్స్‌ ఇచ్చారు. సీఎం వైఎస్‌ జగన్‌ ఫొటోతో కూడిన స్టిక్కర్‌ను అడిగి మరీ తీసుకుని ఇంటి తలుపులకు, మొబైల్‌ ఫోన్‌లకు అతికించుకుని అభిమానాన్ని చాటుకున్నారు. 

జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమం ఈ నెల 7న ప్రారంభమైంది. ఈ కార్యక్రమం ఐదో రోజు ముగిసేటప్పటికి అంటే మంగళవారానికి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు తెలుపుతూ 37 లక్షల కుటుంబాలకు చెందిన అక్కచెల్లెమ్మలు, అవ్వాతా­తలు, అన్నదమ్ములు 82960 82960 మిస్డ్‌ కాల్స్‌ ఇ­చ్చారు. అన్ని వర్గాల నుంచి ప్రభుత్వానికి మద్దతు వెల్లువెత్తుతుండటం సీఎం వైఎస్‌ జగన్‌ సుపరి­పాలనకు దర్పణంగా నిలుస్తోందని రాజకీ­య పరిశీ­ల­­కులు విశ్లేషిస్తున్నారు. టీడీపీ సహా ఇతర ప్రతిపక్షా­లు సంప్రదాయక ఓటర్లుగా భావించే కుటుంబాల నుంచి కూడా వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి మద్దతు లభిస్తుండటం విశేషం.  
 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)