Breaking News

గ్రానైట్‌ దందాకు వెల కట్టి వేలం!

Published on Wed, 08/14/2024 - 06:02

సాక్షి ప్రతినిధి, బాపట్ల:  ప్రభుత్వానికి పన్నులు ఎగ్గొట్టి, అధికార పార్టీ నేతలకు కప్పం చెల్లిస్తూ మార్టూరు నుంచి పాలి‹Ù్డ గ్రానైట్‌ పలకలను జీరో దందాతో అక్రమంగా తరలిస్తున్నారు. జీరో దందా కోసం వ్యాపారులు అధికార పార్టీ పర్చూరు ముఖ్యనేత అనుచరులకు ఒక్కో లారీకి రూ.40 వేలు చొప్పున కప్పం  చెల్లిస్తున్నారు. రోజుకు 80 లారీలకుపైగా గ్రానైట్‌ తెలంగాణకు తరలిపోతుండగా అక్కడి నుంచి ఇతర రాష్ట్రాలు, దేశాలకు ఎగుమతి అవుతోంది.  

పర్చూరు, చిలకలూరిపేట, సత్తెనపల్లి, నరసరావుపేట, గురజాల టీడీపీ నేతలు ఇందులో వాటాలు పంచుకుంటున్నారు. దందా నడిపిస్తున్న పర్చూరు ముఖ్యనేత, చిలకలూరిపేట నేతకు నెలకు రూ. 2.64 కోట్లు చొప్పున చెల్లిస్తుండగా నరసరావుపేట, సత్తెనపల్లి, గురజాల నేతలు ముగ్గురికీ నెలకు రూ.2.20 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదిరింది. 

ఇక రెవెన్యూ, పోలీసు, మైనింగ్, కమర్షియల్‌ టాక్స్‌ అధికారులకు కలిపి నెలకు రూ.60 లక్షలు చెల్లిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా రోజుకు ఒక్కో లారీకి రూ. 40 వేల చొప్పున 80 లారీలకు రూ.32 లక్షలు వంతున దందా నిర్వాహకులు నెలకు రూ. 9.60 కోట్లు వసూలు చేస్తున్నారు. ఇందులో అధికార పార్టీ నేతలు, అధికారులకు రూ.5.44 కోట్లు చెల్లిస్తుండగా రూ.4.17 కోట్లు దందా నిర్వాహకుల వాటాగా చెబుతున్నారు.  

ఖజానాకు భారీగా గండి 
ప్రభుత్వానికి పన్నులు చెల్లించకుండా గ్రానైట్‌ను అక్రమంగా తరలిస్తుండటంతో ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ప్రతి టన్ను పాలిష్డ్‌ రాయికి సేల్స్‌ టాక్స్‌ రూ.1,300, మైనింగ్‌ టాక్స్‌ రూ.700 చొప్పున మొత్తం రూ.2 వేలు ప్రభుత్వానికి చెల్లించాలి. ఈ లెక్కన 35 టన్నుల లారీకి రూ.70 వేలు టాక్స్‌ కట్టాలి. రోజుకు 80 లారీలు దొడ్డి దారిన గ్రానైట్‌ను తరలిస్తుండగా నిత్యం రూ.56 లక్షలు చొప్పున నెలకు రూ.16.80 కోట్లు టాక్స్‌ ఎగ్గొడుతున్నారు. 

గ్రానైట్‌ పాలి‹Ù్డ రాయి అక్రమ రవాణా వ్యవహారం అధికార పార్టీలో కాక రేపుతోంది. ప్రధా­­నంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్, పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు వర్గాల మధ్య నెలకొన్న వివాదం టీడీపీ పెద్దల వద్దకు చేరినట్లు సమాచారం. దీనిపై ఒకటి రెండు రోజుల్లో పంచాయితీ నిర్వహించనున్నట్లు తెలిసింది. 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)