Breaking News

ధాన్యం వర్షార్పణం

Published on Fri, 12/20/2024 - 05:13

దాచేపల్లి(పల్నాడు జిల్లా): ఆరుగాలం కష్టపడి పండించిన పంట వర్షార్పణమైంది. నడికుడి వ్యవసాయ మార్కెట్‌­యార్డులోని ఫ్లాట్‌ఫారాలపై రైతులు ఆరబోసిన ధాన్యం గురువారం తెల్లవారుజామున కురిసిన వర్షానికి తడిసి ముద్దయ్యింది. పలువురు రైతులు పొలంలో పండించిన వరి పంటని యంత్రాల ద్వారా కోసి నడికుడి మార్కెట్‌యార్డుకి ఆరబోసేందుకు తీసుకొచ్చారు. 

సుమా­రు మూడు వేలకుపైగా ధాన్యపు బస్తాలను సిమెంట్‌ ఫ్లాట్‌ఫారాలపై రైతు­లు ఆరబోశారు. ఆకస్మాత్తుగా తెల్లవారుజా­మున వర్షం కురవడంతో ఆరబోసిన ధాన్యం మొత్తం తడిసిపోయింది. వర్షపు నీటిలో కొంత ధాన్యం కొట్టుకుపోయింది. వర్షం కురుస్తున్న సమయంలో ఇళ్ల వద్ద నుంచి రైతులు యార్డుకు చేరుకునేలోపే ధాన్యం వర్షంలో తడిసింది. 

వర్షపునీటిలో కొట్టుకుపోతున్న ధాన్యా­న్ని రైతు­లు అతికష్టం మీద ఒబ్బిడి చేసుకున్నారు. ఫ్లాట్‌ఫారంపై ఉన్న ధాన్యపు బస్తాలు కూడా తడిసి ముద్దయ్యాయి. రెండు, మూడు రోజులు ఆరబోసి అమ్ముకుందామని ఆశపడిన అన్నదాత తడిసిన ధాన్యం చూసి నీరుగారిపోయాడు. యా­ర్డులో ఆరబోసిన ధాన్యం సైతం తడిసిపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. 

Videos

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)