Breaking News

ఎట్టెట్టా?

Published on Fri, 12/12/2025 - 06:27

పలమనేరు: చిత్తూరు జిల్లాలో కుంకీ ఏనుగుల కథ అటకెక్కింది. కుంకీల సంరక్షణ ప్రభుత్వానికి పెను భారంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ద్వారా ఏనుగుల మెడకు జీపీఆర్‌ఎస్‌ ట్రాకర్స్‌ను అమర్చనున్నట్టు తెలిపింది. ఇది ఎంతమేరకు సాధ్యమవుతుందో త్వరలో తేలనుంది. 

ముందస్తు వర్ష సూచనలాగే.. 
వాతావరణ శాఖ నుంచి మొబైళ్లకు అలెర్ట్‌ మెసేజీలు వస్తుంటాయి. ఇదే విధంగా ఏనుగుల కదలికల ద్వారా అవి ఏమార్గంలో సంచరిస్తున్నాయే ట్రాక్‌ ద్వారా పసిగట్టి ఏ గ్రామం వైపు వెళుతున్నాయో  ఆ గ్రామస్తుల ఫోన్లకు సందేశాలు పంపేలా అటవీశాఖ ప్లాన్‌ చేస్తోంది. 

కాలర్లకు కట్టడం కష్టమే  
ఇంతకీ అటవీశాఖ భావిస్తున్నట్టు ఏనుగుల మెడకు జీపీఆర్‌ఆర్‌ కాలర్లని అమర్చడం అంత సులభం కాదనే మాట వినిపిస్తోంది. గుంపులోని ఏనుగులను నిలువరించడం ఇక్కడున్న కుంకీల నుంచే సాధ్యం కాదని తేలిపోయింది. మరోవైపు మదపుటేనుగులు జోలికెళ్లే కుంకీలను సైతం ఇవి ఎదిరించి దాడులు చేస్తాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఏనుగుల మెడకు జీపీఆర్‌ టాగ్‌ను ఎలా వేస్తారనేది వెయ్యి డాలర్ల ప్రశ్నగా మారింది.

ఏనుగు మెడకు జీపీఆర్‌ఎస్‌ ట్యాగ్‌!
ప్రస్తుతం పలమనేరు ప్రాంతంలో 14, తమిళనాడు సరిహద్దు అడవుల్లో ఆరు, సోమల ప్రాంతంలో మూడు, గుడిపాల వద్ద రెండు ఏనుగులతోపాటు నాలుగు ఒంటరి ఏనుగులు సంచరిస్తున్నాయి. గుంపులోని ఏనుగుల కంటే ఒంటరిగా సంచరిస్తున్న మదపుటేనుల కారణంగానే ఎక్కువగా ప్రజలపై దాడులు, పంటలకు నష్టం జరుగుతోంది. వీటిని అదుపులోకి తీసుకురావడం కుంకీ ఏనుగులతో కాదని ఇప్పటికే ఫారెస్ట్‌ అధికారులకు తెలిసిపోయింది.

దీంతో సాంకేతికంగా కొత్త మార్గంపై ఉన్నతాధికారులు దృష్టి  సారించారు. ఏనుగుల గుంపులో ఓ ఏనుగు మెడకు రెండేళ్ల బ్యాటరీతో పనిచేసే జీపీఆర్‌ఎస్‌ ట్రాకర్‌ను తగిలించి.. దాని సంచారం ద్వారా ఏనుగుల గుంపు ప్రాంతాన్ని లొకేషన్‌ ద్వారా చూస్తూ ఆ ప్రాంతానికి సమీపంలోని రైతులు, ప్రజల మొబైళ్లకు సందేశాలను పంపేలా ప్లాన్‌ చేస్తున్నట్టు ఇక్కడి ఫారెస్ట్‌ అధికారులు చెబుతున్నారు.

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)