Breaking News

గంజాయి నియంత్రణలో బాబు ప్రభుత్వం విఫలం

Published on Wed, 01/07/2026 - 05:38

సాక్షి, అమరావతి: గంజాయి నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం ఘోర వైఫల్యం చెందిందని పలువురు వక్తలు ధ్వజమెత్తారు. ‘గంజాయిని అరికట్టాలి–యువత భవితను కాపాడాలి’ అనే అంశంపై విజయవాడ బాలోత్సవ భవన్‌లో మంగళవారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం(ఐద్వా), భారత విద్యార్థి సమాఖ్య(ఎస్‌ఎఫ్‌ఐ), భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమావేశంలో వక్తలు మాట్లాడుతూ.. వంద రోజుల్లో గంజాయి రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని చెప్పిన చంద్రబాబు ప్రభుత్వం అందుకు అనుగుణంగా చర్యలు తీసు­కోవ­డంలో విఫలమైందన్నారు. అధికార పార్టీ నాయ­కుల అండదండలతో రాష్ట్రంలో గంజాయి సాగు, రవాణా, వ్యాపారం యథేచ్ఛగా సాగుతోందని మండిపడ్డారు.

రాజకీయ అండతో గంజాయి గ్యాంగులు చెలరేగిపోతున్నాయని, ఇటీవల నెల్లూ­రు జిల్లాలో పెంచలయ్యను కిరాతకంగా హత్య చేసిన ఘటన సమాజాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేసిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని గంజాయి నిరోధానికి విద్యాసంస్థల పరిసరాల్లో నిఘా కమిటీలు, గంజాయికి బానిసలైన యువతకు డి–అడిక్షన్‌ సెంటర్లు ఏర్పాటు చేయాలని, గంజాయి నియంత్రణకు ప్రత్యేకంగా బడ్జెట్‌ కేటాయించాలని కోరారు. యువజన, మహిళా సంఘాలు గంజాయిపై సమరభేరికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

ఈ నెల 7 నుంచి 12 తేదీ వరకు గంజాయికి వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్ర­మాన్ని చేపట్టాలని తీర్మానించినట్లు పేర్కొన్నా­రు. ఈ నెల 12న గంజాయికి వ్యతిరేకంగా ర్యాలీ నిర్వహించాలని, అలాగే, 14న భోగి మంటల్లో గంజాయి దహనం చేయాలని నిర్ణయించినట్లు చెప్పా­రు. ఈ సమావేశంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కె.శ్రీదేవి, వి.సావిత్రి, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి ప్రసన్నకుమార్, ప్రజానాట్య మండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌ తదితర ప్రజాసంఘాల మహిళా నేతలు మాట్లాడారు.

Videos

జియో IPO సంచలనం

బాబుకు దిమ్మతిరిగేలా.. పక్కా ఆధారాలతో SECకి ఫిర్యాదు

రెండో టీ20లో భారత మహిళా జట్టు విజయం

లోపల పసుపు..పైన ఖాకీ.. కోయ ప్రవీణ్ కుమార్ వ్యాఖ్యలపై వెంకట్ రెడ్డి సంచలన కామెంట్స్

టీడీపీకి రెబల్స్ టెన్షన్.. టికెట్లు దక్కక రెబల్స్ గా బరిలోకి!

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

Photos

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)