Breaking News

రోడ్డెక్కిన ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు

Published on Tue, 11/11/2025 - 03:21

నరసరావుపేట ఈస్ట్‌: ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రోడ్డెక్కారు. కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి ప్రైవేటు యాజమాన్యానికి అప్పగిస్తూ జీఓ జారీ చేయటం విద్యార్థుల భవితను ప్రశ్నార్థకం చేసింది. దీంతో తమకు న్యాయంచేయాలని కోరుతూ విద్యార్థులు సోమవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం పల్నాడు కలెక్టర్‌ కృతికా శుక్లాను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. కళాశాలను అదేపేరుతో కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు

అసలేం జరిగిందంటే..: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేస్తూ 2023లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ కళాశాలను గతంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో స్వా«దీనం చేసుకున్న ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌సీవీ కళాశాల ప్రాంగణంలో ఏర్పా­టు చేశారు. గతంలో ఇదే ప్రాంగణంలో జేఎన్‌టీయూ–ఎన్‌ ఇంజినీరింగ్‌ కళాశాల నిర్వహించారు. వారికి సొంత భవనా­లు సమకూరటంతో సదరు ప్రాంగణాన్ని డిగ్రీ కళాశాలకు కేటాయించారు. అయితే తిరిగి చంద్రబాబు ప్రభుత్వం రావటంతో ప్రభుత్వ ఆ«దీనంలో ఉన్న కళాశాల, కళాశాల ఆస్తులను తిరిగి కోర్టు ఉత్తర్వుల మేరకు శ్రీ త్రికోటేశ్వరస్వామి ఎడ్యుకేషనల్‌ సోసైటీ(పాత యాజమాన్యం)కి అప్పగిస్తూ జీఓ జారీ చేసింది.

దీంతో సొసైటీ ప్రతినిధులు తమ కళాశాలను, ఆస్తులను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేయటంతో కళాశాలలో చదువుతున్న విద్యార్థుల భవిష్యత్‌ గందరగోళంగా మారింది. కళాశాల పేరు ఎన్‌బీటీ అండ్‌ ఎన్‌సీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలగా నమోదు కావటంతో ఇప్పుడు తమను వేర్వేరు కళాశాలల్లో చేరమనటంతో తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కళాశాలలో 101 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి సంబంధించిన రికార్డులన్నీ ఇదే కళాశాల పేరుతో ఉండటంతో హఠా­త్తుగా వేరే కళాశాలకు బదిలీ చేస్తే తాము నష్టపోతామని విద్యార్థులు చెబుతున్నారు.

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం అనుబంధ కళాశాలగా, రాష్ట్ర ఉన్నత విద్యామండలి గుర్తింపుతో విద్యార్థులు ప్రభుత్వ డిగ్రీ కళాశాల పేరుతోనే స్కాలర్‌షిప్‌లు ఇతర సదుపాయాలు పొందుతున్నారు. సచివాలయం బయోమెట్రిక్‌ ట్యాగ్‌ సైతం ఎస్‌బీటీ అండ్‌ ఎన్‌సీవీ ప్రభుత్వ కళాశాల పేరుతోనే ఉన్నాయి. కళాశాలను పాత యాజమాన్యానికి అప్పగించి తమను వేరే కళాశాలకు మార్చినట్లయితే తాము నష్టపోతామని వాపోతున్నారు.  తృతీయ సంవత్సరం పూర్తి చేసే వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలను అదే పేరుతో కొనసాగించాలని కోరుతున్నారు. 

Videos

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

కష్టాల్లో అమితాబ్ .. 90 కోట్ల అప్పు.. కానీ రజినికాంత ఎం చేసాడంటే..!

పండక్కి ముందు గోల్డ్ షాక్.. భారీగా పెరిగిన ధరలు

పిఠాపురంలో మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి.. పవన్ ను నమ్మి.. ప్రభుత్వ ఉద్యోగం వదిలేసి..

ఆసియా పారా గేమ్స్ షురూ..

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)