Breaking News

రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువు

Published on Mon, 10/21/2024 - 04:49

బద్వేలు అర్బన్‌: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి మహిళలు, విద్యార్థినులకు రక్షణ కరువైందని వైఎస్సార్‌ జిల్లా ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, బద్వేలు వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే డాక్టర్‌ సుధ విమర్శించారు. బద్వేలు సమీపంలో బాలిక దస్తగిరమ్మ ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురికావడం అత్యంత బాధాకరమైన విషయమన్నారు. రాష్ట్రంలో మహి­ళలు, విద్యార్థినులపై జరుగు­తున్న వరుస ఘటనలు చూస్తుంటే కూటమి ప్రభుత్వ పాలన ఏ విధంగా ఉందో అర్థమవుతుందన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్‌సీపీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. 

లిక్కర్, ఇసుక దందాలతో శాంతిభద్రతలు గాలికి..
హిందూపురం నియోజకవర్గంలో అత్తాకోడళ్లపై జరి­గిన గ్యాంగ్‌రేప్‌ ఘటన.. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో అశ్విని అనే ఇంటర్‌ విద్యార్థిని హత్య ఘటన మరువక ముందే తాజాగా బద్వేలులో దస్తగి­రమ్మ హత్య.. ఇలా వరుసగా దుర్ఘటనలు జరుగు­తున్నా కూటమి ప్రభుత్వం తప్పులను సరిదిద్దుకునే ప్రయత్నం చేయకపోవడం బాధాకరమన్నారు. లిక్కర్, ఇసుక స్కాంలలో పాలకులు నిండా ముని­గిపోయి మహిళల రక్షణ బాధ్యతలను పూర్తిగా విస్మరి­స్తున్నారన్నారు. పోలీసు వ్యవస్థ కూడా అధికా­రంలో ఉన్న వారి అడుగులకు మడుగులొత్తుతూ ప్రతిపక్ష నేతలను తప్పుడు కేసులతో వేధించడమే పనిగా పెట్టుకున్నారని, శాంతిభద్రతలను పట్టించుకోవడం మానేశారని మండిపడ్డారు. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో మునుపెన్నడూ లేవన్నారు.  

వైఎస్సార్‌సీపీ హయాంలో మహిళల రక్షణకు పెద్దపీట
ఇక గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో బాలికలు, మహిళల భద్రతకు పెద్దపీట వేశారని, ఇందులో భాగంగానే విప్లవాత్మకంగా దిశ యాప్‌ను తీసుకొచ్చారన్నారు. మహిళల రక్షణ కోసం రాష్ట్రవ్యా­ప్తంగా 18 దిశ పోలీసుస్టేషన్లు ఏర్పాటుచేయడంతో పాటు ప్రత్యేకంగా 13 పోక్సో కోర్టులు, 12 మహిళా కోర్టులు ఏర్పాటుచేసి ప్రత్యేకంగా పబ్లిక్‌ ప్రాసిక్యూ­టర్లను ఏర్పాటుచేశారని వారు గుర్తుచేశారు. అంతేకాక.. పెట్రోలింగ్‌ వ్యవస్థను పటిష్టపరిచామ­న్నారు. అయితే, రాజకీయ కక్షతో చంద్రబాబు దిశ వ్యవస్థను నిర్వీర్యం చేశారని ఆరోపించారు.

Videos

బాబు ఒక్కసారి.. ఈ బామ్మ... ఈ వీడియో చూడు

టీడీపీ గూండాల దాష్టికం

హీరో తేజ సజ్జా పెళ్లి ఫిక్స్... అమ్మాయి ఎవరంటే?

స్టీల్ ప్లాంట్ బాధితులకు మాటిస్తున్నా... వరుదు కళ్యాణి కీలక వ్యాఖ్యలు

విడుదల రజినిని కిందకు తోసేస్తారా... అనితపై బండి పుణ్యశీల ఫైర్!

జనసేనకు డిపాజిట్లు రావొద్దు.. మంత్రి నారాయణ ఆడియో లీక్!

ఓటు తొలగింపు అంటే పౌరులను తొలగించడమే.. SIRపై సంచలన వ్యాఖ్యలు

Alert: ముంచుకొస్తున్న అర్జబ్ తూఫాన్

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)