Breaking News

7న గవర్నర్‌ విశాఖ జిల్లా పర్యటన

Published on Fri, 01/06/2023 - 08:39

పద్మనాభం: గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఈ నెల 7న విశాఖ జిల్లాలో పర్యటించనున్నారు. పద్మనాభం మండలంలోని పాండ్రంగి పంచాయతీ బర్లపేటలో దివ్యాంగ బాలబాలికల ఉచిత విద్య శిక్షణ కేంద్రం, వృద్ధాశ్రమం, యోగా కేంద్రం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ఈ విషయాన్ని రాజీవ్‌గాంధీ మానవ సేవ అవార్డు గ్రహీత రూపాకుల రవికుమార్‌ గురువారం తెలిపారు.

7న ఉదయం 11.30 గంటలకు గవర్నర్‌ బర్లపేటకు వచ్చి అక్కడ స్వాతంత్య్ర సమరయోధులు రూపాకుల విశాలాక్షి, రూపాకుల సుబ్రహ్మణ్యం విగ్రహాలకు పూలమాల వేస్తారు. అనంతరం నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసి అక్కడ ఏర్పాటు చేసిన వేదికపై నుంచి ప్రసంగిస్తారు. గాయత్రి, వెల్ఫేర్‌ అండ్‌ కల్చరల్‌ యూత్‌ అకాడమీ, రూపాకుల విశాలాక్షి చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి జీవీఎంసీ మేయర్‌ గొలగాని హరి వెంకట కుమారి, ఎమ్యెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రాజ్యసభ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు హాజరుకానున్నట్లు రవికుమార్‌ తెలిపారు. సభా ప్రాంగణాన్ని, శిలాఫలకం ఏర్పాటు చేయనున్న ప్రాంతాన్ని డీసీపీ సునీల్‌ సుమిత్‌ గరుడ్, ఆర్డీవో భాస్కరరెడ్డి, సీఐ సన్యాసినాయుడు గురువారం పరిశీలించారు. 

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)