Breaking News

ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తోంది 

Published on Mon, 07/31/2023 - 03:53

మచిలీపట్నంటౌన్‌: ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరిస్తూనే.. మరికొన్ని డిమాండ్లను కూడా నెరవేర్చేందుకు సీఎం జగన్‌ సానుకూలంగా స్పందిస్తున్నారని ఏపీఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బండి శ్రీనివాసరావు, కె.వి.శివారెడ్డి చెప్పారు. ఆదివారం విజయవాడలో వారు.. ఉద్యోగులతో సమావేశమయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ముఖ్యమంత్రి అంచెలంచెలుగా పరిష్కరిస్తున్నారని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజేషన్‌పై త్వరలోనే జీవో రాబోతోందన్నారు.

సీఎం జగన్‌.. ఇంతటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటం అభినందనీయమన్నారు. ఉద్యోగులపై సీఎం జగన్‌ ప్రేమాభిమానాలు చూపుతున్నారనే దానికి ఇది ఒక ఉదాహరణ అని పేర్కొన్నారు. 33 ఏళ్లుగా కార్పొరేషన్‌ కింద ఉన్న ఏపీ వైద్య విధాన పరిషత్‌ ఉద్యోగులను సీఎం జగన్‌ 010 పరిధిలోకి తెచ్చారని వివరించారు. ఈ ఉద్యోగులు గతంలో ఎప్పుడు జీతం పడుతుందో తెలియక ఇబ్బందులు పడేవారని.. ఇప్పుడు ప్రతి నెలా 1వ తేదీనే జీతం అందుకుంటున్నారని చెప్పారు. సీపీఎస్‌ కాకుండా జీపీఎస్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పిందని.. ఇది కూడా ఉపయోగకరమేనన్నారు.

71 డిమాండ్లను ప్రభుత్వానికి నివేదించగా.. 65 డిమాండ్లపై సానుకూలంగా స్పందించారని.. మిగిలిన వాటిని కూడా సీఎం జగన్‌ పరిష్కరిస్తారనే ఆశాభావం తమకు ఉందన్నారు. ఆగస్ట్‌ 21, 22 తేదీల్లో ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగే సంఘం మహాసభలను జయప్రదం చేయాలని ఉద్యోగులను కోరారు. ఈ సభలకు సీఎం జగన్‌తో పాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు కూడా హాజరవుతున్నారన్నారు. సమావేశంలో ఏపీఎన్జీవో సంఘం నాయకులు ఉల్లి కృష్ణ, ఎ.వెంకటేశ్వరరావు, దారపు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)