Breaking News

సీబీఐకి అప్పగిస్తే అభ్యంతరం లేదు

Published on Thu, 12/14/2023 - 05:51

సాక్షి, అమరావతి: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం దర్యాప్తును సీబీఐ, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) లేదా ఏ దర్యాప్తు సంస్థకు అప్పగించినా అభ్యంతరం లేదని రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు నివేదించింది. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కుంభకోణం తీవ్రత దృష్ట్యా దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని కోరుతూ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌)పై న్యాయమూర్తులు జస్టిస్‌ ఉప్మాక దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ మండవ కిరణ్మయి ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది.

ఈ సందర్భంగా దర్యాప్తును సీబీఐకి అప్పగించినా అభ్యంతరం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వం తరపున హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్‌ కుమార్‌ గుప్తా కౌంటర్‌ దాఖలు చేశారు. ఈ కుంభకోణంలో పలు చిక్కులున్నాయని రాష్ట్ర ప్రభుత్వం కౌంటర్‌లో పేర్కొంది. మనీలాండరింగ్‌ కూడా జరిగిందని వివరించింది. సీఆర్‌డీఏ పరిధిలో జరిగిన అసైన్డ్‌ భూముల కుంభకోణం, ఏపీ ఫైబర్‌నెట్‌ కుంభకోణాలపై 2020లోనే సీఐడీ దర్యాప్తు చేపట్టిందని, వీటిపై దర్యాప్తు చేయాలని సీబీఐని కూడా కోరినట్లు తెలిపింది.

సీబీఐ రాష్ట్రంలో దర్యాప్తు చేసేందుకు సూత్రప్రాయ అంగీకారం కూడా తెలిపామంది. ఇందుకు జీవోలు కూడా జారీ చేశామని తెలిపింది. ఉండవల్లి వ్యాజ్యంలో కోర్టు ఏ ఆదేశాలు జారీ చేసినా కట్టుబడి ఉంటామని తెలిపింది. కోర్టు ఆదేశాల మేరకు కౌంటర్‌ దాఖలు చేశామని రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ తెలిపారు.

ఇతర మార్గాల్లోనోటీసులు పంపేందుకు అనుమతివ్వండి
నోటీసులు ఎవరికి అందాయి, ఎవరికి అందలేదని ధర్మాసనం ప్రశ్నించగా.. కొందరికి అందాయని, కొం­దరు తిరస్కరించారని, డోర్‌ లాక్, ఇంట్లో లేరు వంటి కారణాలతో కొన్ని వెనక్కి వచ్చాయని ఉండవల్లి తరఫు సీనియర్‌ న్యాయవాది కేజీ కృష్ణమూర్తి వివరించారు. నోటీసులు అందని వారికి పత్రికలు, వాట్సాప్, ఇతర మార్గాల్లో పంపేందుకు అనుమతివ్వాలని కోరారు.

సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి జో­క్యం చేసుకుంటూ.. ఇప్పటి వరకు సీఐడీ చేసిన దర్యాప్తు వివరాలతో ఓ నివేదికను కోర్టు ముందుంచుతామని తెలిపారు. ప్రతివాదులందరికీ నోటీసులు వెళ్లాక నివేదికపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం తెలిపింది. నోటీసులు అందని వారికి వాటిని అందజేసేందుకు చర్యలు తీసుకోవాలని ఉండవల్లిని ధర్మాసనం ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. 

Videos

లోన్ కట్టలేదని వేధిస్తున్నారా? RBI రూల్స్ ఇవే!

దేనితో కొట్టాలి వీళ్లని.. పోలీసులే అభ్యర్థులను లాక్కెళుతున్నారు

సల్మాన్ ఖాన్‌తో పనిచేస్తే ఇదే గతి.. ఈ అనిల్ పండిత్ ఎవరు..?

PF ఉన్నవారందరికీ పెన్షన్ వస్తుందా? అసలు లెక్కలు తెలుసుకోండి..

వేటకొడవల్లితో TDP రౌడీలు దాడి.. బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

తిరుపతిలో దొంగల బీభత్సం 90 గ్రాముల బంగారం చోరీ!

టీడీపీ దాడులకు భయపడే ప్రసక్తేలేదు.. సజ్జల మాస్ వార్నింగ్

వైరల్ అవుతున్న వీడియో, దారుణం.. వెంటబడి మరి TDP గూండాల అరాచకం

టీడీపీ గూండాలు... కడపలో కత్తిపోట్లు.. పులివెందులలో కాల్పుల కలకలం

ఒక్కొక్కడి పేరు అడ్రస్ నోట్ చేస్తున్న.. సిగ్గు లేకుండా ఫోన్ ఆఫ్ చేసి పారిపోయారు

Photos

+5

యాంకర్ అనసూయ ఇంట్లో దసరా సెలబ్రేషన్ ఇలా (ఫొటోలు)

+5

ఫ్యాషన్ షో కోసం తృప్తి దిమ్రి క్రేజీ గ్లామర్ (ఫొటోలు)

+5

దసరా స్పెషల్.. చూడముచ్చటగా విజయ్-రష్మిక జంట (ఫొటోలు)

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)