Breaking News

రాజధానిలో మరో దోపిడీకి స్కెచ్‌!

Published on Wed, 10/08/2025 - 05:16

సాక్షి, అమరావతి: రాజధాని నిర్మాణం ముసుగులో మరో దోపిడీకి ముఖ్యనేత స్కెచ్‌ వేశారు. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్టు, ఎన్టీఆర్‌ విగ్రహం, స్మార్ట్‌ ఇండస్ట్రీస్, ఐకానిక్‌ బ్రిడ్జి, స్పోర్ట్స్‌ సిటీ, రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, రోప్‌వే, ఇన్నర్‌ రింగ్‌ రోడ్‌(ఐఆర్‌ఆర్‌)తోపాటు ఎప్పటికప్పుడు గుర్తించే ప్రత్యేక ప్రాజెక్టులను చేపట్టడానికి స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌(ఎస్పీవీ)ని ఏర్పాటుచేస్తూ మంగళవారం పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. 

రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ(సీఆర్‌డీఏ), ఎస్పీవీ సిఫార్సుల ఆధారంగా ప్రత్యేక ప్రాజెక్టులను చేపడతారు. ఆ ప్రాజెక్టులకు పీపీపీ, హైబ్రీడ్‌ యాన్యుటీ, ఇంజినీరింగ్‌ ప్రొక్యూర్‌మెంట్‌ అండ్‌ కన్‌స్ట్రక్షన్‌(ఈపీసీ) పద్ధతుల్లో టెండర్లు పిలిచి పనులను కాంట్రాక్టర్లకు అప్పగిస్తారు. ఆ కాంట్రాక్టర్లతో సీఆర్‌డీఏ, ప్రభుత్వం, ఎస్పీవీ త్రైపాక్షిక ఒప్పందం చేసుకుంటాయి.  

భూములు తాకట్టు పెట్టి అప్పులు తెచ్చుకుని పనులు 
రాజధానిలో ప్రత్యేక ప్రాజెక్టుల పనులు చేజిక్కించుకున్న కాంట్రాక్టర్లకు నేరుగా భూములు కేటాయిస్తారు. ఆ భూములు తనఖా పెట్టి అప్పులు తీసుకోవడానికి కాంట్రాక్టర్‌కు హక్కులు కల్పిస్తారు. ఆ ప్రాజె­క్టుల ద్వారా పన్నులు, యూజర్‌ చార్జీల రూప­ంలో వచ్చే ఆదాయంలో వాటా (రెవెన్యూ షేరింగ్‌) వంటి అంశాలను సీఆర్‌డీఏ ఖరారు చేస్తుంది. అప్పటికీ ఆ ప్రాజెక్టుల్లో నష్టం వస్తే వయ­బులిటీ గ్యాప్‌ ఫండ్‌(వీజీఎఫ్‌) కింద కాంట్రాక్టర్లకు ప్రభుత్వమే నిధులు ఇస్తుంది. 

వీటిని పరిశీలిస్తే.. ప్రత్యేక ప్రాజెక్టులను సన్నిహితులకు కట్టబెట్టి భారీ ఎత్తున భూములు కేటాయించి.. వాటిని తనఖా పెట్టి.. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తెచ్చే అప్పులతో వాటిని చేపట్టి ‘నీకింత... నాకింత’ అంటూ దోచుకోవడానికి ముఖ్యనేత స్కెచ్‌ వేశారన్నది స్పష్టమవుతోందని ఇంజినీరింగ్‌ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

కాగా, ఈ ప్రాజెక్టుల కోసమే ప్రభుత్వం రాజధానిలో మలి విడత భూసమీకరణకు సిద్ధమైందన్నది స్పష్టమవుతోందని అధికారవర్గాలు చెబుతున్నాయి. గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌ పోర్ట్, స్పోర్ట్స్‌ సిటీ, స్మార్ట్‌ ఇండస్ట్రీస్‌ వంటి వాటి కోసం భూములు అవసరమని పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ పదేపదే చెబుతుండటం విదితమే.

రాజధాని భూసేకరణకు గ్రీన్‌ సిగ్నల్‌ సర్కార్‌ ఉత్తర్వులు
సాక్షి, అమరావతి: రాజధానిలో భూసమీకరణ పథకం(ల్యాండ్‌ పూలింగ్‌ స్కీం) కింద భూములు ఇవ్వని రైతుల నుంచి భూములను సేకరించే ప్రక్రియను చేపట్టడానికి ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. గతంలో 343.36 ఎకరాల భూసేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్‌లో చట్టపరమైన లోపాలు ఉండటంతో దాన్ని ఉపసంహరించుకుంది. ఈ మేరకు పురపాలకశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌.సురేష్ కుమార్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. 

గుంటూరు జిల్లా తుళ్లూరు, తాడేపల్లి, మంగళగిరి మండలాల పరిధిలోని 29 గ్రామాల్లో 217 చదరపు కిలోమీటర్లు(53,749.49) ప్రాంతాన్ని రాజధానిగా 2015లో ప్రభుత్వం ప్రకటించింది. రాజధాని నిర్మాణానికి అవసరమైన భూమిలో 15,807.91 ఎకరాలు ప్రభుత్వ భూమి కాగా, 37,941.58 ఎకరాలు రైతులది. భూసమీకరణ పథకం కింద 34,396.87 ఎకరాలను ప్రభుత్వం సమీకరించింది. మరో 3,544.71 ఎకరాలను సమీకరణ కింద ఇచ్చేందుకు రైతులు అంగీకరించలేదు. ఇప్పుడు ఆ భూములను సేకరించడానికి ప్రభుత్వం సిద్ధమైంది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)