Breaking News

గిరిజనులకు వరం

Published on Sun, 12/21/2025 - 04:46

వెనుకబడిన గిరిజన ప్రాంతంలో గిరిజనులకు కార్పొరేట్‌ స్థాయి ఉన్నత వైద్యం అందించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాడేరులో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ఎందరో విద్యార్థుల వైద్య విద్య కలను సాకారం చేసింది. రూ.500 కోట్లతో ఈ  కళాశాల నిర్మాణం చేపట్టారు. పాడేరు ప్రాంతీయ ఆస్పత్రిని జిల్లా సర్వజన ఆస్పత్రిగా అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు కోట్ల రూపాయలు వెచ్చించి అన్ని సౌకర్యాలను కల్పించారు. 

వైద్య కళాశాల ప్రిన్సిపల్‌ పోస్టును భర్తీ చేయడంతో పాటు ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, వైద్య సిబ్బంది, టెక్నికల్‌ సిబ్బందిని నియమించి జిల్లా సర్వజన ఆస్పత్రిని కార్పొరేట్‌ స్థాయిలో అభివృద్ధి చేశారు. ఎన్నికల అనంతరం జాతీయ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు కళాశాలను సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఫలితంగా 50 సీట్లతో గత ఏడాది వైద్య కళాశాల ప్రారంభమైంది. ఈ ఏడాది కూడా 50 మంది వైద్య విద్యార్థులతో రెండవ బ్యాచ్‌ క్లాసులు జరుగుతున్నాయి. 

ప్రభుత్వ నిర్వాకం వల్ల మరో 50 సీట్లు ఈ ఏడాది రాకుండా పోయాయి. ప్రస్తుతం మొదటి, రెండవ ఏడాది విద్యార్థులు 100 మందితో పాడేరు ప్రభుత్వ మెడికల్‌ కళాశాల కళకళలాడుతోంది. ఈ కళాశాల ఇక్కడ ఏర్పాటు చేయ­బట్టే.. ఎంబీబీఎస్‌ సీట్లు పెరిగి తన లాంటి వారెందరికో సీట్లు వచ్చాయని ఎంతో మంది విదార్థులు కొనియాడుతున్నారు. తమకు మంచి వైద్యం అందుతోందని అటు గిరిజనులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు.  – సాక్షి, పాడేరు (అల్లూరి సీతారామరాజు జిల్లా)  

జగనన్న చొరవతో నాకు సీటొచ్చింది 
మా నాన్న చాన్నాళ్ల క్రితం చనిపోయారు. అమ్మ కష్టపడి నన్ను చదివిస్తోంది. నాకొచ్చిన ర్యాంకుకు మా ఊళ్లో సీటు రాదు. కొత్తగా జగనన్న మెడికల్‌ కళాశాలలను ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రంలో సీట్ల సంఖ్య పెరిగి, నాకు గత ఏడాది ఎంబీబీఎస్‌ సీటు వచ్చింది. తద్వారా నా లాంటి పేద విద్యార్థులకు వైద్య విద్య చదివే అవకాశం దక్కింది. 

పాడేరులో మంచి వాతావరణంలో వైద్య కళాశాలను నిర్మించారు. చాలా బాగుంది. ఇక్కడ అధునాతన సదుపాయాలు కల్పించారు. ఇందుకు కృషి చేసిన వైఎస్‌ జగన్‌ అన్నకు కృతజ్ఞతలు. ఎందరో పేదలకు వైద్య విద్యను అందించిన ఆయనకు మనస్ఫూర్తిగా జన్మదిన శుభాకాంక్షలు.    – చల్ల అభినయ, పేరేచర్ల, గుంటూరు జిల్లా    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)