Breaking News

భృతి.. భ్రాంతి

Published on Sat, 03/01/2025 - 04:13

నిరుద్యోగ యువతను వంచించడంలో చంద్రబాబు రికార్డులు సృష్టిస్తున్నారు. హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి వారిని దగా చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. 1999 నుంచి 2024 వరకు ఎన్నికల వేళ అధికారం కోసం ఉద్యోగాల సృష్టి.. నిరుద్యోగ భృతి.. అంటూ ఊదరగొట్టే చంద్రబాబు.. పీఠం ఎక్కిన తర్వాత హామీల తెప్ప తగలేస్తున్నారు. వాస్తవానికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే భృతి అమలు చేస్తారని నిరుద్యోగులు ఆశలు పెట్టుకున్నారు.

కానీ, చంద్రబాబు అండ్‌ కో సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా 2024–25 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడంలో తీవ్ర జాప్యం చేశారు. తాజా బడ్జెట్‌లో­నూ నిరుద్యోగుల ఊసే విస్మరించారు. ఎన్నికల ముందు ఇంటికో ఉద్యోగం, లేకుంటే ఉద్యోగం వచ్చే వరకు నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి ఇస్తామన్న హామీని తుంగలో తొక్కారు. కూటమి పాలనలో రెండేళ్లలో నిరుద్యోగులు రూ.1,15,200కోట్లు భృతిని నష్టపోతున్నారు.   – సాక్షి, అమరావతి 

ఒక్క నోటిఫికేషన్‌ లేదు.. 
రాష్ట్రంలో నిరుద్యోగులు చంద్రబాబు ఉచ్చులో పడి విలవిల్లాడుతున్నారు. ఒకవైపు ప్రభుత్వ నోటిఫికేషన్లు లేవు. 
గత ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చి గ్రూప్‌–1 ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహిస్తే కూటమి సర్కారు వచ్చిన తర్వాత మెయిన్స్‌ నిర్వహించడంలో తీవ్ర జాప్యం చేస్తోంది. 2024 జూన్‌లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు గ్రూప్‌–1 మెయిన్స్‌ను ఈ ఏడాది మేకి వాయిదా వేసుకుంటూ వచ్చారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ నోటిఫికేషన్‌కు మరిన్ని పోస్టులు కలిపి ఇస్తామని చెప్పి రద్దు చేశారు. 

మళ్లీ ఇప్పటి వరకు డీఎస్సీ నోటిఫి­కేషన్‌కు దిక్కులేదు. ఈ తొమ్మిది నెలల్లో ఒక్క నోటిఫి­కేషన్‌ను సరిగ్గా చేపట్టలేక చేతులెత్తేసిన ప్రభుత్వం నిరుద్యో­గులకు కనీసం ఆర్థిక సాయం కింద నెలకు రూ.3 వేలు ఇవ్వకుండా మోసం చేసింది. ప్రభుత్వంపై ఆర్థిక భారం తగ్గించుకునేందుకు అవుట్‌ సోర్సింగ్, డైలీ వేజస్‌ వర్కర్ల ఉద్యోగాలను తొలగిస్తోంది.  

ఇది చంద్రబాబుకు కొత్తేమీ కాదు..
చంద్రబాబుకు నిరుద్యోగులను మోసం చేయడం కొత్తేమీ కాదు. 2014–19 మధ్య రూ.2 వేలు నిరుద్యోగ భృతి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి, నాలుగున్నరేళ్లకు పైగా ఆ ఊసే ఎత్తేలేదు. 2017–18లో రూ.500 కోట్లు కేటాయించినా, పైసా కూడా ఇవ్వలేదు. అప్పటి ప్రతిపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ తీవ్ర ఒత్తిడి తీసుకురావడంతో ఎన్నికలకు ముందు యువ నేస్తం పేరుతో తూతూ మంత్రంగా డ్రామా నడిపించారు. 

విధివిధానాల రూపకల్పనకు మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసి సవాలక్ష ఆంక్షలు విధించి నిరుద్యోగ భృతి ఇచ్చే వారి సంఖ్యను భారీగా కుదించారు. తొలుత 12 లక్షలకు పైగా నిరుద్యోగ భృతికి అర్హులుగా తేల్చగా.. ఆ తర్వాత పది లక్షలకు కుదించారు. మళ్లీ అందులో 2.10 లక్షల మందే అర్హులంటూ చెప్పారు. తీరా 1.62 లక్షల మందికే ఇస్తామని, దీనికి ఈ–కెవైసీ లింక్‌ పెట్టారు. తుదకు అందులోనూ కొంత మందికే నిరుద్యోగ భృతి ఇచ్చి.. అందరికీ ఇచ్చినట్లు కలరింగ్‌ ఇచ్చుకున్నారు.

ఏటా నిరుద్యోగులకు ఇవ్వాల్సింది రూ.57,600 కోట్లు
బడ్జెట్‌లో  కేటాయించింది 0

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు