Breaking News

పేదల ఇళ్లకు పెద్దపీట

Published on Sun, 06/02/2024 - 05:56

సాక్షి, అమరావతి: పేదల ఇళ్ల నిర్మాణాలకు వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నట్లు 2024–25 రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు ఒకటిన్నర సెంట్ల చొప్పున 30.20 లక్షల ఇళ్ల స్థలాల పట్టాలను ఉచితంగా పంపిణీ చేయడంతోపాటు మహిళల పేరిట ఇచ్చిన స్థలాల్లో గృహ నిర్మాణాలను కూడా చేపట్టిందని నాబార్డు ప్రముఖంగా ప్రస్తావించింది. 

గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాలకు బ్యాంకులు విరివిగా రుణాలు ఇవ్వాలని సూచించింది. 17,005 లేఔట్లలో వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో ఇళ్ల నిర్మాణాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిందని, మూడు దశల్లో మొత్తం నిర్మాణాలను పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించుకుందని పేర్కొంది. ఇప్పటికే తొలి దశలో 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసిందని తెలిపింది.

పేదల ఇళ్ల లబ్ధిదారుల నిర్మాణాలకు రాష్ట ప్రభుత్వం నాణ్యమైన మెటీరియల్‌ను తక్కువ ధరకే సమకూర్చడంతోపాటు కాలనీల్లో రోడ్లు, నీటి సరఫరా లాంటి మౌలిక సదుపాయాలను కల్పిస్తోందని నాబార్డు పేర్కొంది. 2024–25లో ఇళ్ల నిర్మాణాలకు రూ.20,901 కోట్లు రుణ ఆవశ్యకత ఉందని జిల్లాల వారీగా రాష్ట్ర ఫోకస్‌ పత్రంలో నాబార్డు తెలిపింది. 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)