Breaking News

కోలుకుంటున్న గోపిక

Published on Tue, 11/03/2026 - 05:36

సాక్షి, అమరావతి/సాక్షి, బెంగళూరు: అనంతపురం జిల్లా రాప్తాడు ఘటనలో తీవ్రంగా గాయపడి బెంగళూరులో చికిత్స పొందుతున్న పదో తరగతి విద్యార్థిని గోపిక క్రమంగా కోలుకుంటోంది. బాలిక శరీరంపై పెద్దఎత్తున రంపపు కోతలున్నట్లు సమాచారం. సుమారు 11 గంటల సుదీర్ఘ క్లిష్టమైన ఆపరేషన్‌ను వైద్యులు నిర్వహించారు. వీటికి కుట్లు వేయడానికి ఏకంగా 110 బాక్స్‌లకు పైగా సూచర్‌ మెటీరియల్‌ను వైద్యులు వినియోగించారని తెలుస్తోంది. చెట్లు కోసే ఎలక్ట్రిక్‌ రంపం యంత్రంతో నిందితుడు హేమంత్‌ శనివారం అత్యంత క్రూరంగా గోపికపై దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గోపికకు బెంగళూరులోని మణిపాల్‌ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. బాలిక హెల్త్‌ బులిటెన్‌ను వైద్యశాఖ సోమవారం విడుదల చేసింది.

అదుపులోకి రక్తపోటు.. మూత్రపిండాలు సాధారణ స్థితికి..
గోపిక రక్తపోటు క్రమంగా అదుపులోకి వచ్చిందని వైద్యశాఖ తెలిపింది. ఆదివారం వరకు రక్తపోటు నియంత్రణకు రెండు రకాల మందులు ఇవ్వగా, బాలిక స్పందించడంతో రాత్రికి ఒక మందును నిలిపివేశారు. మూత్ర విసర్జన వ్యవస్థ మెరుగుపడటంతో పాటు, రక్త పరీక్షల్లో మూత్రపిండాల పనితీరు సాధారణ స్థాయిలో ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. రానున్న 48 గంటలు ఎంతో కీలకమని వారు  చెబుతున్నారు.

గోపిక క్రమంగా కోలుకుంటోందని, ప్రాణాపాయం నుంచి బయటప­డుతుందని ఆశాభావం వ్యక్తంచేశారు. గోపిక ఆరోగ్యం యథాస్థితికి చేరుకున్న తర్వాత శరీరంపై ఉన్న గాయా­లకు ప్లాస్టిక్‌ సర్జరీ అవసరం పడుతుందని ప్లాస్టిక్‌ సర్జన్స్‌ అభిప్రాయపడుతు­న్నారు. దాడి అనంతరం బాలికకు అత్యవసర చికిత్స అందించడంలో వేగంగా స్పందించిన అనంత జీజీహెచ్‌ వైద్యులు హరికృష్ణ, మహేశ్, సాంకేతిక నిపుణుడు గౌస్‌కు డీఎంఈ డాక్టర్‌ విష్ణువర్థన్‌ ప్రశంసాపత్రాలు ఇచ్చారు.

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)